
తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై విధివిధానాల ఖరారుకు కేబినెట్ సబ్‌కమిటీ వేశామన్న రేవంత్.. కార్యాచరణపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఎవరు అడ్డుపడినా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ నేతల మాటలు రైతులు నమ్మొద్దని కోరారు.
రూ. 16 వేల కోట్ల మిగులుతో తెలంగాణను కేసీఆర్‌కు అందిస్తే, పదేళ్ల తర్వాత రూ.7 లక్షల అప్పులతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారన్నారు రేవంత్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో ఏ సర్కార్ ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదన్న ముఖ్యమంత్రి.. 2018 నుంచి 2023 వరకు ఐదేళ్లలో తీసుకున్న లోన్స్ అన్నీ ఏకకాలంలో తీర్చినట్లు వివరించారు. తెలంగాణకు భారీగా అప్పులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 25లక్షల 35వేల మంది రైతులకు 21,000 కోట్ల రుణాలు మాఫీ చేశామని వెల్లడించారు. రేషన్‌కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేశామన్నారు. మాజీ ప్రధాని నెహ్రూ నుంచి.. ఇప్పటివరకు రైతులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని సీఎం తెలిపారు. అలానే రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. కొత్త సంవత్సరంలో.. సంక్రాంతి పండగ తర్వాత రేషన్ కార్డులు ఉన్న వాళ్లందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి