Revanth Reddy: దక్షిణ భారత్‌లో బీజేపీ గెలిచే స్థానాలు ఎన్ని? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంచనా ఇదీ..

లోక్ సభ ఎన్నికల సమరం తారస్థాయికి చేరింది.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మూడోసారి అధికారం కోసం బీజేపీ, ఎలాగైనా పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy: దక్షిణ భారత్‌లో బీజేపీ గెలిచే స్థానాలు ఎన్ని? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంచనా ఇదీ..
Revanth Reddy
Follow us

|

Updated on: Apr 18, 2024 | 3:59 PM

లోక్ సభ ఎన్నికల సమరం తారస్థాయికి చేరింది.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మూడోసారి అధికారం కోసం బీజేపీ, ఎలాగైనా పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడుతూ.. దక్షిణాదిలో బీజేపీ ప్రభావం ఉండదంటూ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దక్షిణ భారతదేశంలో పట్టు కోసం కష్టపడుతుందని, ఈ ప్రాంతంలోని 130 లోక్‌సభ స్థానాల్లో 15 కంటే తక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేరళ.. తమిళనాడు, తెలంగాణ, ఏపీలో ఇలా అన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాలలో తన ఉనికిని విస్తరించేందుకు సర్వశక్తులు ఒడ్డింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి.. గత కొన్ని వారాల నుంచి ఆ రాష్ట్రాలలో వరుస పర్యటనలు చేశారు.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సౌత్ ఇండియాలోని 130 సీట్లలో ఇండియా కూటమి 115 – 120 మధ్య కైవసం చేసుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ ఓడించే ప్రయత్నంలో ఇది కీలకంగా మారుతుందని తెలిపారు. దక్షిణాదిలో 130 సీట్లు ఉన్నాయి.. బీజేపీకి 12 నుంచి 15 వచ్చే అవకాశం ఉంది.. మిగతావన్నీ ఇండియా కూటమికే దక్కుతాయి.. అంటూ అని కేరళలోని అట్టింగల్‌లో కాంగ్రెస్‌కు చెందిన అదూర్ ప్రకాష్‌కు ప్రచారం చేస్తూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలను ఇండియా గెలుచుకుంటుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈసారి బీజేపీ పోటీ చేసే స్థానాల్లో డిపాజిట్లు కూడా రావని భావిస్తున్నానన్నారు. తెలంగాణలోని 17 సీట్లలో 14 స్థానాలను ఇండియా కూటమి విజయం సాధిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

అయితే, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్.. దాని మిత్రపక్షాలు (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) కింద రాష్ట్రంలోని అన్ని స్థానాలను పూర్తిగా కైవసం చేసుకున్నాయి. అయితే, ఈసారి పరిస్థితి మారింది. ఇండియా కూటమి లోని వామపక్షాలు.. కాంగ్రెస్ విడివిడిగా పోటీచేస్తున్నాయి. CPIM -కాంగ్రెస్ సీట్ల-భాగస్వామ్య ఒప్పందాన్ని అంగీకరించడంలో విఫలమయ్యాయి..

ఈ ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ‘మిషన్‌ సౌత్‌’ని ప్రకటించింది.. ఈ క్రమంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి పార్టీకి బలమైన ప్రదర్శన అవసరం. గత ఎన్నికల్లో పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. తెలంగాణలో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..