CM KCR: మతం, కులం పేరిట దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోంది.. సీఎం కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

చేతకాని, తెలివి తక్కువతనం పరిపాలన వల్ల దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కే చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. 60 ఏళ్ల కిందట తెలంగాణ సమాజం నిద్రలో ఉండటం వల్లే తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపారన్నారు.

CM KCR: మతం, కులం పేరిట దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోంది.. సీఎం కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
Cm Kcr
Follow us

|

Updated on: Aug 17, 2022 | 5:53 PM

CM KCR Comments on BJP Govt: ‘‘ఢిల్లీలో 24 గంటలు కరెంట్‌ ఉండదు.. కానీ హైదరాబాద్‌లో 24 గంటల కరెంట్ ఉంటుంది.. మెదడు, హృదయంతో ఆలోచిస్తేనే మంచి పనులు చేయగలుగుతాం’’ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. దేశంలో 75 ఏళ్ల నుంచి జరుగుతున్న అసమర్థ పరిపాలన ఇదేనంటూ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చేతకాని, తెలివి తక్కువతనం పరిపాలన వల్ల దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కే చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. 60 ఏళ్ల కిందట తెలంగాణ సమాజం నిద్రలో ఉండటం వల్లే తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపారన్నారు. 58 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణను సాధించుకున్నామని పేర్కొన్నారు. లేకపోతే ఈ నీళ్లు, కరెంట్ వచ్చేవి కాదంటూ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బుధవారం మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌ నూతన భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మేడ్చల్‌ జిల్లా అవుతుందని ఎవరూ అనుకోలేదన్నారు. పరిపాలన ఎంత దగ్గరగా వస్తే.. పనులు అంత త్వరగా అవుతాయన్నారు. రాష్ట్రంలో మరో పది లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అందరికీ కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ వచ్చాక ఎన్నో మంచి పనులు చేసుకున్నామని.. అన్ని రంగాలకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో కరెంటు పోదు కానీ.. ఢిల్లీలో 24 గంటలు కరెంట్‌ ఉండదంటూ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. దేశంలో 75 ఏళ్ల నుంచి జరుగుతున్న అసమర్థ పరిపాలన..చేతకాని, తెలివి తక్కువతనం పరిపాలన వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ పేర్కొన్నారు. మేడ్చల్‌ జిల్లాలోని ప్రతి ఎమ్మెల్యేకు.. అభివృద్ధి పనుల కోసం మరో రూ.10 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణకు అద్భుతమైన నిధులు ఉన్నాయని.. సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కొందరు మూర్ఖులు తెలివి తక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇక్కడి అభివృద్ధిని చూసి దేశమంతా నివ్వెరపోతోందంటూ పేర్కొన్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే దెబ్బతింటారు.. ఇంకా ఏపీలోనే ఉంటే ఈ సంక్షేమం ఉండేదా అంటూ ప్రశ్నించారు. దేశంలో జరిగే పరిణామాలపై చర్చ జరగాలని మరోసారి స్పష్టంచేశారు. భవనం కట్టాలంటే చాలా కష్టం, కూలగొట్టాలంటే చాలా ఈజీ నంటూ పేర్కొన్నారు. మతం, కులం పేరిట దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోందని.. ఇది ఏ రకంగానూ మంచిది కాదంటూ సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని.. ఒకసారి దెబ్బతిన్నామంటే మళ్లీ ఏకంగా కావడం అంత ఈజీ కాదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. చైనా, సింగపూర్‌, కొరియా దేశాల తరహాలో.. కుల, మతాలకు అతీతంగా పని చేయాలన్నారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి మిగిలిన చోట్ల ఎందుకు జరగడం లేదో ఆలోచించాలన్నారు. ఇక్కడ చేసుకున్న అభివృద్ధినీ కొందరు పనిగట్టుకొని మరి చెడగొడుతున్నారని సీఎం కేసీఆర్‌ విమర్శించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..