Telangana: కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు చేరడంపై భట్టి కీలక వ్యాఖ్యలు

|

Jul 10, 2023 | 5:31 PM

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరే విషయంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. జూపల్లి కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి, రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగం ఉంటుందని పేర్కొన్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరే సమయంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Telangana: కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు చేరడంపై భట్టి కీలక వ్యాఖ్యలు
Batti Vikramarka And Jupally Krishna Rao
Follow us on

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరే విషయంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. జూపల్లి కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి, రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగం ఉంటుందని పేర్కొన్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరే సమయంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈరోజున బంజారాహిల్స్‌లోని భట్టి విక్రమార్క ఇంటికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి్, జూపల్లి కృష్ణారావు వెళ్లారు. మహబూబ్‌నగర్‌లోని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం అలాగే కాంగ్రెస్‌లో చేరే విషయంపై కూడా భట్టి విక్రమార్కతో వారు చర్చించారు.

కొల్లాపూర్‌లో నిర్వహించబోయే బహిరంగ సభకు రావాలని భట్టిని ఆహ్వానించామని.. ఈ సభకు కాంగ్రెస్ జాతీయ నేతలు కూడా హాజరుకానున్నారని జూపల్లి కృష్ణారావు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌లో చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కుమారుడు మేఘా రెడ్డి కూడా పార్టీలో చేరతారని వెల్లడించారు. అలాగే ఖమ్మం జిల్లా రాజకీయాలపై కూడా భట్టితో చర్చించామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే అంశాలపై చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండే వర్గాలు ఉన్నాయని.. ఒకటి ప్రభుత్వ అనుకూల వర్గం కాగా మరొకటి వ్యతిరేక వర్గమని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు బలంగా నిర్ణయించుకున్నారని వివరించారు. అలాగే కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేరికకు సంబంధించి పార్టీలో పెద్దవాళ్లు చూసుకుంటారని వెల్లడించారు.