
హైదరాబాద్ గాంధీభవన్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. బుధవారం జరిగిన హైదరాబాద్ పార్లమెంట్ సమీక్షలో ప్రోటోకాల్ విషయంలో ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్ హజ్రీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఉస్మాన్ హజ్రీ ఫీరోజ్ ఖాన్‌ను చెంపదెబ్బ కొట్టి కిందకు తోసేశాడు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన సీనియర్ నేత వీహెచ్‌ను సైతం తోసేశారు నేతలు. దీంతో కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు మంత్రులు.
అయితే ఈ గొడవ తర్వాత ఘటనపై ఫిరోజ్ ఖాన్ స్పందించారు. కుర్చీలో కూర్చోవడం విషయంలో ఇబ్బంది జరిగిందని.. చిన్న మిస్ అండర్ స్టాండింగ్‌తో గొడవ మొదలైందన్నారు. మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ అనుకున్నారననారు. ఉస్మాన్ తను పెద్దన్న లాంటివాడని..గొడవ జరిగిన తర్వాత ఉస్మాన్ తనకు ముద్దు పెట్టారన్నారు. ఉస్మాన్ తనను స్టేజ్‌పైకి రమ్మంటే తాను వెళ్లలేదని.. ఇది మా ఫ్యామిలీ విషయం అని ఫిరోజ్ ఖాన్ చెప్పుకొచ్చారు.
అటు ఇదే గొడవపై కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఉస్మాన్ సైతం స్పందించారు. ఫిరోజ్‌ఖాన్‌కు క్షమాపణ చెప్పానని ఆయన తెలిపారు. తాము ఇద్దరం అన్నదమ్ములమని.. ఇది తమ మధ్య జరిగిన చిన్న గొడవని అన్నారు. మాది కాంగ్రెస్ ఫ్యామిలీ.. ఫ్యామిలీలో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇది కామనని హజ్రీ చెప్పుకొచ్చాడు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.