జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు లైన్‌క్లియర్.. క్లారిటీ వచ్చిన ఎక్స్‌అఫీషియో సభ్యుల సంఖ్య

|

Jan 29, 2021 | 6:44 AM

ఫిబ్రవరి 11న జరిగే జీహెచ్ఎంసీ ప్రత్యేక సమావేశానికి సంబంధించిన కొత్త ఎక్స్‌అఫీషియోలకు సమాచారం అందించనున్నట్లు సమాచారం.

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు లైన్‌క్లియర్.. క్లారిటీ వచ్చిన ఎక్స్‌అఫీషియో సభ్యుల సంఖ్య
Follow us on

GHMC ex-officio members : ఎట్టకేలకు హైదరాబాద్ మహానగర మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో కీలకమైన ఎక్స్‌అఫీషియో సభ్యుల సంఖ్య తేలింది. మొత్తం 194 మంది ఓటర్లలో 45 మంది ఎక్స్‌ అఫీషియోలుగా, 149 మంది కార్పొరేటర్లుగా తేల్చారు. 45 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులలో 33 మంది టీఆర్‌ఎస్‌కు చెందిన వారుకాగా, మిగిలిన వారిలో ఒకటి బీజేపీ, పది మంది మజ్లిస్‌ పార్టీకి సంబంధించిన సభ్యులు ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 11న జరిగే జీహెచ్ఎంసీ ప్రత్యేక సమావేశానికి సంబంధించిన కొత్త ఎక్స్‌అఫీషియోలకు సమాచారం అందించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక విధానంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేటర్లు సహా ఎక్స్‌ అఫీషియో సభ్యులు చేతులెత్తే విధానం ద్వారా మేయర్ ఎన్నికను నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్స్ నిబంధనలు 2005కు అనుగుణంగా ఎన్నిక విధానం ఉంటుందని వివరించింది. ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు చట్టప్రకారం నమోదయ్యే ఎక్స్ అఫీషియో సభ్యులు చేతులెత్తి మేయర్‌ను, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవచ్చని వెల్లడించింది.