AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: 13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు!

కామంతో కళ్లుమూసుకుపోయిన కొందరు వ్యక్తులు..అమ్మాలపైనే కాదు అబ్బాయిపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ 13ఏళ్ల బాలుడిపై లైంగిక దాడిని పాల్పడ్డాడనే ఆరోపణలు నిజమని తేలడంతో 30 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Hyderabad: 13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు!
Teacher Gets Life Imprisonment For Child Assault Case
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Sep 29, 2026 | 8:35 PM

Share

హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఎల్‌.బి.నగర్‌లోని రంగారెడ్డి జిల్లా రేప్‌, పోక్సో కేసుల విచారణ ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి 29-09-2026న తీర్పు వెలువరించారు. నేరం రుజువు కావడంతో నిందితుడు మహ్మద్‌ మునావర్‌ హుస్సేన్‌ (30)కు జీవిత ఖైదుతో పాటు రూ.25,500 జరిమానా విధించారు. అలాగే బాధితుడికి రూ.2 లక్షల నష్టపరిహారం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది.

పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌లో 2025 జనవరి 4న ఈ కేసు నమోదైంది. బాధితుడు 13 ఏళ్ల బాలుడు కాగా.. మామిడిపల్లి గ్రామంలోని ఇస్లామియా కాషిఫుల్‌ ఉలూమ్‌ మదర్సాలో చదువుతున్నాడు. 2024 డిసెంబర్‌ 26న బాలుడు అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు అతడిని ఇంటికి తీసుకువచ్చారు. మరుసటి రోజు వైద్య పరీక్షలు నిర్వహించగా బాలుడి రహస్య అవయవాల వద్ద తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో 2025 జనవరి 1న బాలుడు తన తల్లికి జరిగిన విషయాన్ని వెల్లడించాడు. మదర్సాలో టీచర్‌గా పనిచేస్తున్న నిందితుడు 2024 డిసెంబర్‌ 25న సాయంత్రం బాలుడిని వాహనంపై పహాడీషరీఫ్‌ రాజీవ్‌గాంధీనగర్‌లోని మసీద్‌-ఎ-రహమత్‌ ఉన్నీసా సమీపంలోని ఓ గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు బాలుడు తెలిపాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజుల ముందు కూడా నిందితుడు ఇదే విధంగా ప్రవర్తించినట్లు బాలుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Cr.No.09/2025 కింద BNS సెక్షన్‌ 351(2), పోక్సో చట్టం 2012లోని సెక్షన్‌ 5(f)(l), 6 కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితుడిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసి, కోర్టులో ఆధారాలను సమర్థవంతంగా ప్రవేశపెట్టారు. కేసు విచారణలో ప్రాసిక్యూషన్‌ తరఫున అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కృష్ణ ప్రసన్న వాదనలు వినిపించారు. దీంతో నిందితుడిపై ఉన్న ఆరోపణలు నిజమని తేలడంతో కోర్టు అతనికి జీవితఖైదు వేస్తూ తీర్పు వెలువరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్‌ను గోల్డెన్ లేగ్ మార్చిన రాఘవేంద్రరావు..
ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్‌ను గోల్డెన్ లేగ్ మార్చిన రాఘవేంద్రరావు..
పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!
పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!
సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...
పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...
జాతకంలో లక్ష్మీ యోగం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?
జాతకంలో లక్ష్మీ యోగం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?
స్వీట్ షాప్ నడిపి ఆ తర్వాత టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ గా ఎదిగి..
స్వీట్ షాప్ నడిపి ఆ తర్వాత టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ గా ఎదిగి..
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గడ్డం వెనక సీక్రెట్ ఇదేనా?
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గడ్డం వెనక సీక్రెట్ ఇదేనా?
ఒక్క రోజులో గోకుడు గజ్జి, తామరను ఇట్టే తరిమికొట్టొచ్చు..
ఒక్క రోజులో గోకుడు గజ్జి, తామరను ఇట్టే తరిమికొట్టొచ్చు..
శని నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశులకు ఇక తిరుగులేదట!
శని నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశులకు ఇక తిరుగులేదట!