Chicken Prices: చికెన్ ధరలు ఢమాల్.. ఒక్కసారిగా భారీగా తగ్గుదల.. ఇప్పుడు కిలో ఎంతంటే..?

చికెన్ ధరలు పడిపోయాయి. మొన్నటివరకు ధరలు ఆకాశాన్నంటాయి. దాదాపు కిలో చికెన్ రూ.400 వరకు పలికాయి. ఆ తర్వాత ధరలు తగ్గుతూ వస్తోండగా.. ఇప్పుడు మరింత పడిపోయాయి. దీంతో నాన్ వెజ్ ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. ఆదివారం కిలో చికెన్ ఎంత ఉందంటే..

Chicken Prices: చికెన్ ధరలు ఢమాల్.. ఒక్కసారిగా భారీగా తగ్గుదల.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
Chicken Prices

Updated on: Apr 05, 2026 | 11:13 AM

నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు తగ్గాయి. ఇటీవల కిలో చికెన్ రూ.350 వరకు చేరుకుంది. అయితే ఆ తర్వాత పడిపోతూ స్ధిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం చికెన్ ధరలు స్ధిరంగా ఉన్నాయి. ఆదివారం కావడంతో నాన్ వెజ్ ప్రియులు మాంసం దుకాణాల ముందు క్యూలు కడుతున్నాయి. సెలవు రోజు కావడంతో మాంసం తింటూ చిల్ అవుతున్నారు. ధరలు కూడా స్థిరంగా ఉండటంతో మాంసం ప్రియులు ఊరట లభించింది. ఆదివారం చికెన్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

హైదరాబాద్‌లో ఎంతంటే..?

హైదరాబాద్‌లో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.276 వద్ద కొనసాగుతోంది. ఇక డ్రస్స్‌డ్ చికెన్ రూ.242గా ఉండగా.. రిటైల్ లైవ్ బర్డ్ రూ.167గా ఉంది. ఇక ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.140గా ఉంది. ఇక విజయవాడలో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.267, డ్రస్స్‌డ్ చికెన్ రూ.235, రిటైల్ లైవ్ బర్డ్ రూ.162, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.135గా ఉంది. ఇక కరీంనగర్‌ జోన్‌లో స్కిన్ లెస్ రూ.276 వద్ద కొనసాగుతోంది. ఇక వరంగల్‌లో రూ.280, కామారెడ్డిలో రూ.290, గుంటూరులో రూ.250, విశాఖలో రూ.270, బాపట్లలో రూ.300కి అమ్ముతున్నారు. చికెన్ ధరలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. స్థానిక ఫామ్స్ నిర్వహణ, రవాణా ఖర్చులను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. ధరలు తగ్గడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు.

చికెన్ ధరలు ఢమాల్

మార్చి నెలాఖరులో చికెన్ ధరలు రికార్డ్ సృష్టించాయి. కిలో చికెన్ రూ.400 వరకు చేరుకుంది. ఆ తర్వాత తగ్గుతూ వస్తోండగా.. రాబోయే రోజుల్లో మరింత పడిపోయే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో చికెన్ షాపులు బంద్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో అధికంగా కోళ్ల సరఫరా జరుగుతోంది. ఈ కారణంతో ధరలు తగ్గుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

 

Follow Us