Telangana: కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై తెలంగాణ వాహనాలకు TS బదులు TG!

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లకు 'టీఎస్' స్థానంలో 'టీజీ' అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్లేట్లపై కొత్త ప్రిఫిక్స్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీలోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి కార్యాలయం తెలిపింది.

Telangana: కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై తెలంగాణ వాహనాలకు TS బదులు TG!
Ts To Tg

Updated on: Mar 13, 2024 | 9:49 AM

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లకు ‘టీఎస్’ స్థానంలో ‘టీజీ’ అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్లేట్లపై కొత్త ప్రిఫిక్స్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీలోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి కార్యాలయం తెలిపింది. మోటారు వాహనాల చట్టం 1988 (59 ఆఫ్ 1988) లోని సెక్షన్ 41 సబ్ సెక్షన్ (6) అధికారాలను ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం జూన్ 12, 1989 నాటి రవాణా సంఖ్య ఎస్ఓ 444 (ఇ) లో భారత ప్రభుత్వ నోటిఫికేషన్ లో ఈ క్రింది సవరణలు చేస్తుంది.

అధికారిక గెజిట్ లో ఈ నోటిఫికేషన్ ప్రచురితమైంది. వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో టీఎస్ టు టీజీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తక్షణమే అంటే మార్చి 12, 2024 నుండి అమల్లోకి వచ్చే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రెగ్యులేటరీ స్పష్టత, సమర్థతను పెంపొందించడమే ఈ మార్పు లక్ష్యమని తెలిపింది. కొత్త వాహనాలకు ఈ మార్పు వర్తిస్తుందని, టీఎస్ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు కొనసాగుతాయన్నారు. రోడ్లపైకి వచ్చే కొత్త వాహనాలకు రాష్ట్రంలో ‘టీజీ’ ప్రిఫిక్స్ తో రిజిస్టర్డ్ నంబర్ ప్లేట్లు ఉంటాయని తెలిపింది. అయితే పాత వాహన యజమానులు కూడా నంబర్ ప్లేట్లలో మార్పులు చేసి కొత్త రూల్ కు మారే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వం చేపట్టిన పథకాలను మారుస్తూ, వాటిని సవరణలు చేస్తూ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. రైతుబంధు రైతభరోసాగా, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇందిరమ్మ ఇళ్లుగా ఆ పథకాలను కొనసాగిస్తోంది. ఇక తెలంగాణను టీఎస్ బదులు టీజీ చేస్తామని అధికారంలోకి చేపట్టిన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.