Watch Video: కాంగ్రెస్ పార్టీకి పొన్నాల బై బై.. దానం నాగేందర్ ఏమన్నారంటే..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పొన్నాల శుక్రవారం ప్రకటించారు. ఆ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీకి ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించి.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
కాంగ్రెస్ పార్టీలో బీసీలకు విలువ లేదంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. పార్టీలో బీసీలకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీకి మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడంపై దానం నాగేందర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల ఓట్లు కావాలి గానీ… వారికి సీట్లు మాత్రం ఇవ్వరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో గతంలో తనకు కూడా అవమానం జరిగిందని.. అందుకే ఆ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరినట్లు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీకి ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించి.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

