Motkupalli Narasimhulu: బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లికి కరోనా.. పరిస్థితి విషమం..

|

Apr 18, 2021 | 10:14 AM

BJP leader Motkupalli Narasimhulu: తెలంగాణలో కరోనావైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, నాయకులు ఇలా అందరూ కోవిడ్‌ బారిన పడుతున్నారు. తాజాగా

Motkupalli Narasimhulu: బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లికి కరోనా.. పరిస్థితి విషమం..
Motkupalli Narasimhulu
Follow us on

BJP leader Motkupalli Narasimhulu: తెలంగాణలో కరోనావైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, నాయకులు ఇలా అందరూ కోవిడ్‌ బారిన పడుతున్నారు. తాజాగా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మోత్కుపల్లి నరసింహులు సోమాజీగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి కొంచి విషమంగా ఉండటంతో వైద్యులు మోత్కుపల్లిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్యం మరింత క్షిణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు నేతలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

కాగా మోత్కుపల్లి నరసింహులు ఇటీవలనే టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. అప్పటినుంచి మోత్కుపల్లి నర్సింహులు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వల్ప అనారోగ్యం కలగడంతో వెంటనే పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ప్రస్తుతం నర్సింహులు సోమాజీగూడలోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదిలాఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం (నిన్న) రాత్రి 8గంటల వరకు 1,29,637 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 5,093 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతోపాటు 15 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 37,037 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న అత్యధికంగా 743 కేసులు నమోదయ్యాయి.

Also Read:

Hyderbad: ప్రేమించి పెళ్లి చేసుకొని.. మరో యువతితో ప్రేమాయణం.. భార్యకు తెలియడంతో..

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు.. భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు..