
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఎంపీ సోయం అనారోగ్యానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా ప్రస్తుతం మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటేసిన సంగతి తెలిసిందే. సాధారణ ప్రజలతో పాటు.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు, పోలీసులు, వైద్యులు ఈ వైరస్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు కూడా కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. మరికొందరు ఈ వైరస్ బారి నుంచి కోలుకుంటున్నారు. ఇక తాజాగా తన పీఏతో పాటు, ఇద్దరు గన్‌మెన్లు, ఒక కానిస్టేబుల్, డ్రైవర్, మరో సహాయకుడికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం వెల్లడించారు.
Read More:
గణేష్ నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి కీలక నిర్ణయం..
యజమాని మాస్క్ పెట్టుకోలేదని.. మేకను అరెస్ట్!
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మృతి