గ‌ణేష్ నిమ‌జ్జ‌నాల‌పై భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేష్ ఉత్స‌వ్ స‌మితి కీల‌క నిర్ణ‌యం..

ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోన్న విష‌యం తెలిసిందే. దీంతో ఈ ఏడాది గ‌ణేష్ పండుగ (వినాయ‌క చ‌వితి) ఘ‌నంగా జ‌రుపుకునేలా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు పాటిస్తూ గ‌ణేష్ ఉత్స‌వాలు నిర్వ‌హించుకోవాల‌ని..

గ‌ణేష్ నిమ‌జ్జ‌నాల‌పై భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేష్ ఉత్స‌వ్ స‌మితి కీల‌క నిర్ణ‌యం..
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 2:57 PM

ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోన్న విష‌యం తెలిసిందే. దీంతో ఈ ఏడాది గ‌ణేష్ పండుగ (వినాయ‌క చ‌వితి) ఘ‌నంగా జ‌రుపుకునేలా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు పాటిస్తూ గ‌ణేష్ ఉత్స‌వాలు నిర్వ‌హించుకోవాల‌ని భాగ్య‌న‌గ‌ర ఉత్సవ స‌మితి హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. క‌రోనా కార‌ణంగా సెప్టెంబ‌ర్ 1వ తేదీ జ‌ర‌గాల్సిన సామూహిక నిమ‌ర్జ‌నాన్ని విర‌మించుకుంటున్న‌ట్లు భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి తెలియ‌జేసింది. ఇక భౌతిక దూరం పాటిస్తూ గ‌ణేష్ నిమ‌జ్జ‌నాలు చేసుకోవాల‌ని సూచించింది.

అలాగే వినాయ‌క మండ‌పాల‌కు కూడా ఎవ‌రి అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని.. మీ ప్రాంతాల‌కు సంబంధించిన పోలీస్ స్టేష‌న్ల‌కు స‌మాచారం ఇస్తే స‌రిపోతుంద‌ని భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి పేర్కొంది. ఇక గ‌ణేష్ విగ్ర‌హాల ఎత్తుల విష‌యంలో కూడా ఎలాంటి పోటీలు ప‌డొద్ద‌ని కోరింది. మండ‌ల‌పాల వ‌ద్ద న‌లుగురైదుగురు మాత్ర‌మే ఉండాలి. పూజా స‌మ‌యంలో కూడా ప్ర‌తీ ఒక్క‌రూ మాస్క్ ధ‌రించాలి. ప్ర‌తీ మండపం ద‌గ్గ‌ర కోవిడ్‌-19 నియ‌మ నిబంధ‌న‌లు పాటించాలని పేర్కొంది భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి. సంక్షోభ స‌మ‌యంలో ఆరోగ్య‌శాఖ ఆదేశాల ప్ర‌కారం ముందుకు వెళ్లాల‌ని గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి వెల్ల‌డించింది.