కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో.. ఓ ప్రైవేట్ వ్యక్తికి పుట్టినరోజు వేడుకలు జరపడం వివాదాస్పదమవుతోంది. మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో.. వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకలను జరిపారు పోలీసులు. రవీందర్ రెడ్డికి దండవేసి కేక్ తినిపించారు సీఐ ఇంద్రసేనారెడ్డి. అంతేకాకుండా సెల్ఫీలకు ఫోజులిస్తూ.. పోలీస్ స్టేషన్లో నానా హంగామా సృష్టించారు. దాదాపు నెల క్రితం ఈ సంఘటన జరగగా.. తాజాగా వీడియో వెలుగులోకి రావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.