
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇదే పట్టుదలతో కనిపిస్తున్నాయి బీసీ సంఘాలు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలా వద్దా అనేది ప్రభుత్వ పరిధిలోని అంశం. ఆ విషయంలో బీసీ నేతలు జోక్యం చేసుకోవడం లేదు. బట్.. ఎప్పుడైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా 42 శాతం చట్టబద్దమైన రిజర్వేషన్లతో కాకుండా ఎన్నికలకు వెళ్తామన్నారో.. అప్పుడే జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. ఎన్నికలు పెడితే 42 శాతం కోటా అమలు చేసే వెళ్లాలంటున్నారు. అందులో ఆప్షన్స్ వెతుకుతాం, ఈసారికి ఛాన్స్ ఇవ్వండని అంటే మాత్రం ఊరుకునేది లేదంటున్నాయి బీసీ సంఘాలు. ఇంతకీ ఈ లడాయి ఎలా తెగేది? మళ్లీ బీసీ రణరంగం మొదలైంది. తెలంగాణ రాజకీయ తెరపై మరోసారి బీసీ ఉద్యమం పరుగులు పెట్టేలా కనిపిస్తోంది. ఇందుకు కారణం… బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించడమే. బీసీలకు ఏమాత్రం అన్యాయం జరక్కుండా 42 శాతం లేదా అంతకు మించి సీట్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్తామని ఇటు మిగిలిన పార్టీల నుంచి సైతం స్టేట్‌మెంట్ వచ్చింది. అంతే.. ప్రభుత్వం, పార్టీలు అలా అనౌన్స్‌మెంట్ ఇచ్చాయో లేదో భగ్గుమన్నాయి బీసీ సంఘాలు. ఈమాత్రం దానికా తాము పిలుపునిచ్చిన పోరాటానికి పార్టీలన్నీ కలిసొచ్చింది అంటూ మరోసారి వీధుల్లోకి వచ్చారు బీసీ సంఘాల నాయకులు. ఇప్పటిదాకా కొట్లాడింది పార్టీలు ఇచ్చే కోటా కోసమా అనేది బీసీ నేతల ఆగ్రహం. తమకు చట్టబద్దమైన కోటా ఇస్తారా, లేదా...