బర్రెలక్క ఈ పేరు తెలియని తెలంగాణ ప్రజలు ఉండరేమో.. ఏపీలో కూడా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఒకే ఒక్క వీడియోతో పాపులర్ అయ్యింది బర్రెలక్క. నిరుద్యోగ సమస్య కారణంగా బర్రెలు కాస్తున్నా అని వీడియో చేసి ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యింది. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం దొరక్క బర్రెలు కాస్తుంది. ఇక తన వీడియో పాపులర్ అవ్వడంతో ప్రజల సమస్యలు తీర్చడానికి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ఎలక్షన్స్ లో కొల్లాపూర్ స్ధానం నుంచి పోటీ చేసింది.
బర్రెలక్క కు చాలా మంది మద్దతుగా నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి. ప్రచారం కూడా ఆమె విస్తృతంగా చేసింది. కొల్లాపూర్ స్ధానం నుంచి పోటీ చేసిన బర్రెలక్క ఓడిపోయింది. ఆమెకుదాదాపు 6000వేల ఓట్లు పడ్డాయి. కానీ ఆమె క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నికల వేళ బర్రెలక్క పేరు మరు మ్రోగింది. సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు. చాలా మంది పెద్ద వ్యక్తులు ఆమెకు అండగా నిలిచారు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు.ఆర్థికంగానూ కొందరు సాయం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బర్రెలక్క ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం రెడీ అవుతుందని తెలుస్తోంది. ఎలాగైనా రాజకీయాల్లో ఉండాలని ఫిక్స్ అయిన బర్రెలక్క ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతుంది. ఈసారి నాగర్ కర్నూలు నుండి పోటీకి దిగుతానని బర్రెలక్క తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలు నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆచి తూచి అడుగులేస్తానని తెలిపింది బర్రెలక్క. మరి బర్రెలక్క పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..