Amit Shah: కేంద్రమంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు.. ఎందుకంటే?

Amit Shah Telangana visit cancelled: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దైంది. ఆదివారం తెలంగాణలో ఆయన పర్యటించాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆదివారం ఢిల్లీలో హైలెవెల్ మీటింగ్ నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.

Amit Shah: కేంద్రమంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు.. ఎందుకంటే?
Amit Shah Telangana Visit Cancelled

Updated on: Oct 03, 2026 | 5:38 PM

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దైంది. ఆదివారం ఆయన తెలంగాణలోని పర్యటించాల్సి ఉండగా.. చివరి నిమిషంలో దాన్ని రద్దు చేసుకున్నారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఆయన కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌ చేరుకొని అక్కడ.. బీజేపీ నేతలతో సమావేశం అవ్వాల్సి ఉంది.

అయితే అదే రోజు ఢిల్లీలో హైలెవెల్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో.. ఆ మీటింగ్‌కు ఆయన కచ్చితంగా హాజరవ్వాల్సింది.
దీంతో ఆయన తెలంగాణ వచ్చే పర్యటనను రద్దు చేసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఆదివారం అమిత్‌షా తూప్రాన్‌ మండలంలోని బ్రహ్మణపల్లిలో పర్యటించనున్నారనే ముందస్తు సమాచారంతో భద్రతా ఏర్పాట్లు అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కానీ చివరకు నిమిషంలో పర్యటన రద్దలైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us