Covid Vaccine: తెలంగాణలో మొదటి టీకా వేసేది వారికే..16వ తేదీన గాంధీ ఆస్పత్రిలో ప్రారంభించనున్న మంత్రి..

|

Jan 13, 2021 | 7:31 PM

Covid Vaccine: తెలంగాణలో మొదటి టీకా సఫాయి కర్మ చారికే ఇవ్వనున్నారు. ఆమేరకు ప్రభుత్వం సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Covid Vaccine: తెలంగాణలో మొదటి టీకా వేసేది వారికే..16వ తేదీన గాంధీ ఆస్పత్రిలో ప్రారంభించనున్న మంత్రి..
Follow us on

Covid Vaccine: తెలంగాణలో మొదటి టీకా సఫాయి కర్మ చారికే ఇవ్వనున్నారు. ఆమేరకు ప్రభుత్వం సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండగా, సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 139 సెంటర్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు ఒక్కో సెంటర్‌లో 30 మంది చొప్పున ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మరుసటి 50 మందికి, ఆ తరువాతి రోజు 100 మందికి ఇలా అంచెల వారీగా వ్యాక్సిన్ డోసుల సంఖ్య పెంచనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

కాగా, తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వ హెల్త్ కేర్ వర్కర్లకు, ఆ తరువాత ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 3 లక్షల 30 వేల మంది హెల్త్ కేర్ వర్కర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వ్యాక్సినేషన్ సందర్భంగా ఎవరికైనా దుష్ప్రభావాలు కలిగితే వెంటనే చికిత్స అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 57 ఆస్పత్రుల్లో ఐసీయూ పడకలు అందుబాటులో ఉంచారు. ఇక టీకా ఇచ్చిన తరువాత ఖాళీ వ్యాక్సిన్ వాయిల్‌ను రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా, ఇవాళ తెలంగాణకు 20వేల కోవాగ్జిన్ డోసులు వచ్చాయి. మరికాసేపట్లో కోఠి నుంచి జిల్లాలకు వ్యాక్సిన్‌లను తరలించనున్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు ఎస్కార్ట్ వాహనాలతో ఇన్సులేటర్ వాహనాలు బయలుదేరుతాయి. కోవాగ్జిన్ టీకా తీసుకునే వాళ్ళ అనుమతి, సంతకం తీసుకున్నాకే డోసులు ఇవ్వనున్నారు.

Also read:

ఇండిగో ఎయిర్ పోర్ట్ మేనేజర్ దారుణ హత్య, బీహార్ లో నితీష్ ప్రభుత్వానికి ఇరకాటం, రాజీనామాకు విపక్షాల డిమాండ్

Varavara Rao Bail Petition: విరసం నేత వరవరరావు బెయిల్‌ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ