Air India Flight: హైదరాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 109 మంది ప్రయాణికులు సేఫ్!

Air India Flight: టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ (ATC) అధికారులకు సమాచారం అందించారు. పైలట్ నుంచి సమాచారం అందుకున్న అధికారులు విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి తీసుకురావాలని..

Air India Flight: హైదరాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 109 మంది ప్రయాణికులు సేఫ్!
Air India Flight

Edited By:

Updated on: Oct 23, 2026 | 12:55 PM

Air India Flight: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోశుక్రవారం పెను ప్రమాదం తప్పినట్లు సమాచారం. ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా తిరిగి ల్యాండింగ్ అయింది. విమానంలో 109 మంది ప్రయాణికులు ఉండగా.. వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఎయిర్ ఇండియాకు చెందిన AI 417 విమానం శుక్రవారం హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరింది.

అయితే, టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ (ATC) అధికారులకు సమాచారం అందించారు. పైలట్ నుంచి సమాచారం అందుకున్న అధికారులు విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి తీసుకురావాలని సూచించారు. దీంతో విమానం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి చేరుకుని అత్యవసర ల్యాండింగ్ చేసింది.

విమానంలో ఉన్న 109 మంది ప్రయాణికులు సేఫ్‌గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్యకు గల కారణాలను గుర్తించేందుకు నిపుణులు విమానాన్ని తనిఖీ చేస్తున్నారు. అసలు ఏ భాగంలో లోపం తలెత్తింది? సమస్యకు కారణమేంటి? అనే వివరాలు తనిఖీలు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. పైలట్ సకాలంలో స్పందించి ఏటీసీ అధికారులకు సమాచారం అందించడంతో విమానాన్ని సురక్షితంగా తిరిగి ల్యాండింగ్ చేయగలిగారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us