పికప్ చేసుకుని స్నేహితుడికి మెసేజ్.. అతను వచ్చేలోపే ఫ్యానుకు వేలాడిన యువకుడు..!

హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నేహితుడిని పికప్ చేసుకుని మెసేజ్ పెట్టి, అతను వచ్చేలోపే ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ యువకుడు. విట్టాలరావునగర్‌లో ఉన్న ఫ్రెష్ లీవింగ్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఈఘటన వెలుగు చూసింది. ఇందుకు సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

పికప్ చేసుకుని స్నేహితుడికి మెసేజ్.. అతను వచ్చేలోపే ఫ్యానుకు వేలాడిన యువకుడు..!
Young Man Suicide

Updated on: Jan 09, 2026 | 8:26 PM

హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నేహితుడిని పికప్ చేసుకుని మెసేజ్ పెట్టి, అతను వచ్చేలోపే ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ యువకుడు. విట్టాలరావునగర్‌లో ఉన్న ఫ్రెష్ లీవింగ్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఈఘటన వెలుగు చూసింది. ఇందుకు సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఒక వ్యక్తి టవల్ సాయంతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడి వివరాలు సేకరించగా, కరీంనగర్ జిల్లాకు చెందిన బొమ్మల అనుదీప్ కుమార్ (32)గా గుర్తించారు. మృతుడు ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన వ్యాపారం నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అనుదీప్ కుమార్ స్వస్థలం కరీంనగర్ కాగా, సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఒక గదిలో ఉంటున్నట్లు సమాచారం.

అయితే మృతుడు చనిపోయే ముందు తన స్నేహితుడు హరీష్ కు వాట్సాప్ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. తనను సర్వీస్ అపార్ట్‌మెంట్‌కి వచ్చి పికప్ చేసుకోవాలని కోరినట్లు పోలీసులు తెలిపారు. హరీష్ అక్కడికి చేరుకుని చూడగా, అనుదీప్ కుమార్ ఆత్మహత్య చేసుకుని, ఫ్యానుకు వేలాడుతూ ఉండటం గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు గదిని పరిశీలించగా, అక్కడ సూసైడ్ నోట్ లభించినట్లు తెలిపారు. ప్రాథమికంగా ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..