కుటుంబంలో చిచ్చు పెట్టిన పంచాయతీ ఎన్నికలు.. ఒత్తిడి తట్టుకోలేక తల్లి ఏం చేసిందో తెలుసా?

కుటుంబాల్లో ఆర్థిక సంబంధాల కంటే రాజకీయ సంబంధాలు.. బంధుత్వాలను విచ్చినం చేస్తున్నాయి. రాజకీయాలు అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టాయి. రాజకీయాలు, ఎన్నికలు వివాదాలుగా మారి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. తాజాగా గ్రామపంచాయతీ ఎన్నికలు ఓ కుటుంబంలో తల్లి కూతుళ్ళ మధ్య చిచ్చు పెట్టింది. దీంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఏం స్టోరీ చదవాల్సిందే..!

కుటుంబంలో చిచ్చు పెట్టిన పంచాయతీ ఎన్నికలు.. ఒత్తిడి తట్టుకోలేక తల్లి ఏం చేసిందో తెలుసా?
Crime News

Edited By: Balaraju Goud

Updated on: Dec 04, 2025 | 10:53 AM

కుటుంబాల్లో ఆర్థిక సంబంధాల కంటే రాజకీయ సంబంధాలు.. బంధుత్వాలను విచ్చినం చేస్తున్నాయి. రాజకీయాలు అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టాయి. రాజకీయాలు, ఎన్నికలు వివాదాలుగా మారి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. తాజాగా గ్రామపంచాయతీ ఎన్నికలు ఓ కుటుంబంలో తల్లి కూతుళ్ళ మధ్య చిచ్చు పెట్టింది. దీంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఏం స్టోరీ చదవాల్సిందే..!

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, నరసింహ దంపతులకు కూతురు అశ్విని. అశ్వినికి పదేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన సురేష్ తో వివాహం జరిగింది. వీరంతా ఒకే వార్డులో నివాసం ఉంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వీరు నివాసం ఉంటున్న మూడో వార్డు బీసీ మహిళకు రిజర్వు అయింది. దీంతో పోటీ చేయాలనీ భావించిన లక్ష్మమ్మ (40) నవంబర్ 27వ తేదీన నామినేషన్ దాఖలు చేసింది. లక్ష్మమ్మకు బీఆర్ఎస్ మద్దతు పలుకుతోంది.

మూడవ వార్డు నుంచి అశ్విని, ఆమె తోటి కోడలు అర్చన నామినేషన్లు వేశారు. కూతురు అశ్వినికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతోంది. అయితే కుమార్తెపై తానెలా పోటీ చేసేదని లక్ష్మమ్మ మనోవేదన చెందుతోంది. తల్లిపై తాను పోటీ చేసేదని లేదని అశ్విని నామినేషన్ ఉపసంహరించుకుంది. ఈ విషయం అశ్విని తన తల్లికి చెప్పింది. నామినేషన్ ఉపసంహరణ విషయంలో తల్లి కూతుళ్ళ కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. కుటుంబంలో గొడవలకు కారణమైన ఎన్నికల బరిలో తాను పోటీ చేయలేనంటూ లక్ష్మమ్మ తీవ్ర మనస్థాపానికి గురి అయింది. దీంతో లక్ష్మమ్మ ఇంట్లో ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

అయితే తన భార్య కడుపు నొప్పి భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నారని మృతురాలి భర్త మందుల నర్సింహ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, కాంగ్రెస్ నాయకుల వేధింపులు భరించలేక లక్ష్మమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. నామినేషన్ వేసిన రోజు నుంచి లక్ష్మమ్మను వేధిస్తూ, మానసికంగా కుంగదీశారని అన్నారు. ఈ ఘటనకు కారణమైన కాంగ్రెస్ నాయకులు దీనికి పూర్తిగా బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..