Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన భూకబ్జా గ్యాంగ్‌.. కార్లపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్టిక్కర్లు..

|

Mar 31, 2023 | 7:11 AM

హైదరాబాద్‌లో భూకబ్జా గ్యాంగ్‌ రెచ్చిపోయింది. ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు పట్టపగలే విధ్వంసం సృష్టించింది. అయితే, ఈ కబ్జా ఎపిసోడ్‌లోకి ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి పేరు రావడమే ఇప్పుడు హాట్‌ ఇష్యూగా మారింది. కబ్జాకోరుల కార్లపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్టిక్కర్లు ఉండటం అనుమానాలకు దారి తీసింది.

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన భూకబ్జా గ్యాంగ్‌.. కార్లపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్టిక్కర్లు..
Ghmc
Follow us on

హైదరాబాద్‌లో భూకబ్జా గ్యాంగ్‌ రెచ్చిపోయింది. ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు పట్టపగలే విధ్వంసం సృష్టించింది. అయితే, ఈ కబ్జా ఎపిసోడ్‌లోకి ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి పేరు రావడమే ఇప్పుడు హాట్‌ ఇష్యూగా మారింది. కబ్జాకోరుల కార్లపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్టిక్కర్లు ఉండటం అనుమానాలకు దారి తీసింది. ఇంతకీ, భూకబ్జాకు యత్నించింది రోహిత్‌రెడ్డి మనుషులేనా? అసలు ఆ కార్లు ఎవరివి? రోహిత్‌రెడ్డికి కాకపోకపోతే ఆయన స్టిక్కర్లు ఆ కార్లపై ఎందుకున్నాయ్‌? వివరాలు ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్‌ శివార్లలో భూకబ్జాదారులు రెచ్చిపోయారు. పట్టపగలు బుల్డోజర్లు, జేసీబీ, టిప్పర్లతో బీభత్సం సృష్టించారు. అందరూ చూస్తుండగానే జీహెచ్ఎంసీ పార్క్‌ను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. మైలార్‌దేవ్‌పల్లిలోని సర్వే నెంబర్‌ 134/20లో ఎకరా 30 గుంటల స్థలంలో దౌర్జన్యానికి దిగింది రౌడీ గ్యాంగ్‌. నాలుగు జేసీబీలు, పది టిప్పర్లతో పార్క్‌ అండ్‌ ప్లే గ్రౌండ్‌ గోడలను కూల్చేసి భయభ్రాంతులకు గురిచేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులపైనా భూకబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. దాంతో, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికే పార్క్‌ గోడలు కూల్చేసి విధ్వంసం సృష్టించారు కబ్జాకోరులు.

స్థానికులిచ్చిన సమాచారంతో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. నాలుగు జేసీబీలు, పది టిప్పర్లు, రెండు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. స్పాట్‌లో ఇద్దర్ని అదుపులోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు. స్పాట్‌లో అరెస్ట్‌ చేసిన అసద్‌, సజ్జును కాలపత్తార్‌ వాసులుగా గుర్తించారు. అయితే, సీజ్‌ చేసిన వెహికల్స్‌పై ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి స్టిక్కర్లు ఉండటమే ఇప్పుడు అనుమానాలకు దారి తీస్తోంది. కబ్జాకు యత్నించింది ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి మనుషులా?. రోహిత్‌రెడ్డి ఆదేశాలతోనే పార్క్‌ ఆక్రమణకు ప్రయత్నించారా? అనే డౌట్స్‌ రీసౌండ్‌ వస్తున్నాయ్‌.

ఇవి కూడా చదవండి

భూకబ్జాదారులు వచ్చిన కార్లు ఖరీదైనవి కావడంతో అనుమానాలు మరింత పెరిగాయ్‌. పోలీసులు, మీడియా రాకతో కార్లపై ఉన్న ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి స్టిక్కర్లను పీకేసేందుకు ప్రయత్నించారు కబ్జాదారులు. దాంతో, డౌట్స్‌ ఇంకా ఇంకా రెట్టింపు అయ్యాయ్‌. అయితే, ఆ కార్లు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డివేనా?, ఒకవేళ రోహిత్‌రెడ్డివి కాకపోతే ఆ స్టిక్కర్లు వాళ్లకు ఎవరిచ్చారు?. 2022 మార్చిలోనే గడువు ముగిసిన స్టిక్కర్లను ఎందుకు అక్రమంగా వాడుతున్నారనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. స్పాట్‌లో పట్టుబడిన ఇద్దరే అసలు కబ్జాదారులా? కాదా? అనేది తేలాల్సి ఉంది. అయితే, టోటల్‌ ఎపిసోడ్‌లో కబ్జాకోరుల కార్లపై ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి స్టిక్కర్లు ఉండటమే కలకలం రేపుతోంది. మరి, ఆ కార్లపై తన స్టిక్కర్లు ఎందుకున్నాయో?. ఆ కార్లు ఎవరివో? ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సమాధానం చెబుతారో లేదో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..