Crime News: నకిలీ పత్రాలో కోట్లు కొల్లగొట్టాడు.. పోలీసుల ఎంట్రీతో అడ్డంగా బుక్కయ్యాడు..

|

Jan 29, 2021 | 8:53 PM

Crime News: నగరంలో మోసగాళ్లు ఎక్కువైపోతున్నారు. మోసాలపై ఓవైపు అధికారులు పలు సూచనలు చేస్తున్నప్పటికీ..

Crime News: నకిలీ పత్రాలో కోట్లు కొల్లగొట్టాడు.. పోలీసుల ఎంట్రీతో అడ్డంగా బుక్కయ్యాడు..
Follow us on

Crime News: నగరంలో మోసగాళ్లు ఎక్కువైపోతున్నారు. మోసాలపై ఓవైపు అధికారులు పలు సూచనలు చేస్తున్నప్పటికీ.. కేటుగాళ్లు మాత్రం ప్రజలను ఏదోరకంగా బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా నకిలీ కంపెనీలు చూపించి మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అవినా గుడపాటి అనే వ్యక్తి తాను పలు కంపెనీలకు యజమాని అని నకిలీ పత్రాలు చూపడమే కాకుండా, ఫేక్ బ్యాలెన్స్ షీట్స్ చూపించి వేరే కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఆపై నిధులను కొల్లగొట్టేవాడు.

అయితే అతని మోసాన్ని గుర్తించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. జరిగిన మోసాలపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు కంగుతినే వాస్తవాలు వెలుగుచూశాయి. అవీనా గుడపాటిపై గతంలోనూ ఇలాంటి మోసాలకు సంబంధించి కేసులు నమోదైనట్లు గుర్తించారు. అంతేకాదు.. నకిలీ పత్రాలతో వివిధ బ్యాంకుల నుండి భారీగా రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్లు తేల్చారు. హైదరాబాద్‌లో నకిలీ కంపెనీలను చూపించి దాదాపు రూ.15 కోట్లు బ్యాంకుల నుండి రుణం పొందినట్లు పోలీసులు నిర్ధారించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అవీనా గుడిపాటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Telangana Govt: ఫిబ్రవరి 1 నుంచి కళాశాలలు ప్రారంభం.. కీలక సూచనలు చేసిన మంత్రి సబిత..

Corona Virus: పురుషులు జాగ్రత్త… కరోనా సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుందంట..