Corona Virus: పురుషులు జాగ్రత్త… కరోనా సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుందంట..

Corona Virus Could Damage Sperm: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్థిక వ్యవస్థలతో పాటు ఆరోగ్యాలపై కూడా ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. అయితే..

Corona Virus: పురుషులు జాగ్రత్త... కరోనా సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుందంట..
Follow us

|

Updated on: Jan 29, 2021 | 8:25 PM

Corona Virus Could Damage Sperm: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్థిక వ్యవస్థలతో పాటు ఆరోగ్యాలపై కూడా ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. అయితే కరోనా వైరస్ మానవ శరీరంలో ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుందని మనందరికీ తెలిసిందే. అయితే వైరస్ ప్రభావం మానవ శరీరంలోని మరో అంశంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. కోవిడ్-19 వైరస్ ప్రభావం శుక్రకణాలు, సంతానోత్పత్తిపై కూడా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. పురుషుల్లో సంతానోత్పత్తి వ్యవస్థపై కరోనా వైరస్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా కరోనా సోకిన 84 మంది పురుషులను 60 రోజుల పాటు పరిశీలించారు. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత పదో రోజు నుంచి వారి శుక్రకణాల నాణ్యత, సంతానోత్పత్తిపై పరిశోధనలు నిర్వహించారు. వీరితో పాటు వైరస్ సోకని, ఆరోగ్యంగా ఉన్న మరో 105 మందిని పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేశారు. కరోనా సోకని వారితో పోలీస్తే.. సోకిన వారిలో శుక్రకణాలు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా వైరస్ శరీరంలోని డీఎన్ఏ, ప్రోటీన్‌లను సైతం నాశనం చేసినట్లు తేలింది.

Also Read: AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 125 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా