దేశ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు.. సీఎం రేవంత్ సమక్షంలో 130 మంది మావోయిస్ట్‌ల సరెండ్

సాయుధ మిలిటెంట్‌ పోరాటపంథాలో ఒకప్పుడు బలంగా ఉన్న మావోయిస్టు పార్టీ ఇప్పుడు కకావికలమైంది. విప్లవ సాయుధ పోరాటపంథాలో వెళ్లిన మావోయిస్టులు - ఆపరేషన్‌ కగార్‌కు తలొగ్గారు. ఒకవైపు ఎన్‌కౌంటర్లు, మరోవైపు లొంగుబాటులో ఆ పార్టీ పోరాటం క్లైమాక్స్‌కి చేరింది. లొంగుబాట్ల క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అగ్రనేతలే సరెండర్‌ అవుతున్నారు.

దేశ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు.. సీఎం రేవంత్ సమక్షంలో 130 మంది మావోయిస్ట్‌ల సరెండ్
Maoists Surrender

Updated on: Mar 07, 2026 | 4:54 PM

సాయుధ మిలిటెంట్‌ పోరాటపంథాలో ఒకప్పుడు బలంగా ఉన్న మావోయిస్టు పార్టీ ఇప్పుడు కకావికలమైంది. విప్లవ సాయుధ పోరాటపంథాలో వెళ్లిన మావోయిస్టులు – ఆపరేషన్‌ కగార్‌కు తలొగ్గారు. ఒకవైపు ఎన్‌కౌంటర్లు, మరోవైపు లొంగుబాటులో ఆ పార్టీ పోరాటం క్లైమాక్స్‌కి చేరింది. లొంగుబాట్ల క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అగ్రనేతలే సరెండర్‌ అవుతున్నారు.

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయాయారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ కీలక నేత దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి గ్రూపులకు చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్‌ అయింది. అత్యాధునిక ఆయుధాలు 31 ఏకే47లతో పాటు 130 మంది మావోయిస్టులు పోలీసుల ముందు సరెండ్ అయ్యారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు అని పోలీసులు అంటున్నారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం ప్రభుత్వం ఎదుట సరెండర్‌ అయినట్లు తెలుస్తోంది. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కీలక నేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి గన్‌మెన్లు ఉన్నారు.

బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మావోయిస్టులు తమ ఆయుధాలతో లొంగిపోయారు. అంతకుముందు మావోయిస్టులు మొత్తం 4 బస్సుల్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు తీసుకువచ్చారు. మావోయిస్టుల నుంచి మొత్తం 124 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన వారిలో 130 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారుకాగా.. నలుగురు తెలంగాణ, ఒకరు ఏపీకి చెందిన వారు ఉన్నట్లు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు మావోయిస్టులు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నట్లు డీజీపీ తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు స్టేట్ కమిటీ, 10మంది డివిజినల్ కమిటీ, 40మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నట్లు చెప్పారు. మావోయిస్టు పార్టీలోని కంప్యూటర్‌ సిగ్నల్‌ ఆపరేటర్లు, పీఎల్‌జీఏకు చెందిన బెటాలియన్‌ లొంగిపోయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us