Best laptops: పదివేల కంటే తక్కువ ధరకే ల్యాప్ టాప్ మీ సొంతం.. పరిమిత ఆఫర్ వివరాలు ఇవే..!

|

Sep 30, 2024 | 8:35 PM

ల్యాప్ టాప్ ల వినియోగం నేటి కాలంలో సర్వసాధారణంగా మారింది. ప్రతి ఒక్కరూ వివిధ అవసరాల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. లేటెస్ట్ ఫీచర్లతో రూపొందించిన ల్యాప్ టాప్ లు మార్కెట్ లో దొరుకుతున్నాయి. వాటి ధర సుమారు రూ.50 వేలకు తక్కువ కాకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన ల్యాప్ టాప్ లు అత్యంత తక్కువ ధరలో లభిస్తున్నాయి. కేవలం రూ.పది వేల కంటే తక్కువ  ధరతోనే ఇవి ప్రారంభమవుతున్నాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు.

Best laptops: పదివేల కంటే తక్కువ ధరకే ల్యాప్ టాప్ మీ సొంతం.. పరిమిత ఆఫర్ వివరాలు ఇవే..!
Two In One Laptops
Follow us on

ల్యాప్ టాప్ ల వినియోగం నేటి కాలంలో సర్వసాధారణంగా మారింది. ప్రతి ఒక్కరూ వివిధ అవసరాల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. లేటెస్ట్ ఫీచర్లతో రూపొందించిన ల్యాప్ టాప్ లు మార్కెట్ లో దొరుకుతున్నాయి. వాటి ధర సుమారు రూ.50 వేలకు తక్కువ కాకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన ల్యాప్ టాప్ లు అత్యంత తక్కువ ధరలో లభిస్తున్నాయి. కేవలం రూ.పది వేల కంటే తక్కువ  ధరతోనే ఇవి ప్రారంభమవుతున్నాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. సెప్టెంబర్ 27న ప్రారంభమైన సేల్ అక్టోబర్ 6 వరకూ కొనసాగుతుంది. అసర్, హెచ్ పీ, అసర్ తదితర ప్రముఖ బ్రాండ్ల ల్యాప్ టాప్ లను సొంతం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. 

హెచ్ పీ క్రోమ్ బుక్

ఈ ల్యాప్ టాప్ లో 11.6 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 8 కోర్ల మీడియా టెక్ ఎంటీ 8183 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ తదితర ఫీచర్లు ఉన్నాయి.  మైక్రో ఎస్ డీని ఉపయోగించి స్టోరేజ్ ను విస్తరించవచ్చు. కనెక్టివిటీకి సంబంధించి వైఫై 5, బ్లూటూత్ 4.2కి మద్దతు ఉంటుంది. రెండు యూఎస్ బీ టైప్ సి పోర్టులు, 16 గంటల బ్యాటరీ సామర్థ్యం అదనపు ప్రత్యేకతలు. ఈ ల్యాప్ టాప్ రూ.9,990కి అందుబాటులో ఉంది. అదనంగా ఫ్లిప్ కార్ట్, హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డులపై రూ.999, హెచ్ డీఎఫ్ సీ డెబిట్ కార్డులపై రూ.750, ఫ్లిప్ కార్డు యాక్సెస్ క్రెడిట్ కార్డుపై  రూ.500 చొప్పున బ్యాంకు డిస్కౌంట్లు ఉన్నాయి.

హెచ్ పీ టచ్ క్రోమ్ బుక్

మీడియా టెక్ ఎంటీ 8183 ప్రాసెసర్ పై పనిచేసే హెచ్ పీ టచ్ క్రోమ్ బుక్ ల్యాప్ టాప్ లో 11.6 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ తో అందుబాటులో ఉంది. మైక్రో ఎస్ డీ ద్వారా స్టోరేజీని విస్తరించవచ్చు. వైఫై 5, బ్లూటూత్ 4.2, కనెక్టివిటీ కోసం రెండు యూఎస్ బీ టైప్ సి పోర్టులు ఏర్పాటు చేశారు. దాదాపు 16 గంటల బ్యాటరీ సామర్థ్యం దీని ప్రత్యేకత. విద్యార్థులకు, తేలిక పాటి మల్టీ టాస్కింగ్ కు బాగుంటుంది. .హెచ్ పీ టచ్ క్రోమ్ బుక్ ధర రూ.10,990.

ఇవి కూడా చదవండి

అల్టిమస్ ప్రో

సొగసైన డిజైన్, దాదాపు ఆరు గంటల బ్యాటరీ బ్యాకప్ తో అల్టిమస్ ప్రో ల్యాప్ టాప్ ఆకట్టుకుంటోంది. దీనిలో 14.1 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్,128 బీజీ స్టోరేజీ తదితర ఫీచర్లు ఉన్నాయి. విండోస్ 10లో రన్ అవుతుంది. కనెక్టవిటీ కోసం వైఫై బ్లూటూత్, యూఎస్ బీ పోర్టులు, హెచ్ డీఎంఐ పోర్టులు ఏర్పాటు చేశారు. ప్రయాణంలో కూాడా చాాలా సులువుగా ఉపయోగించుకోవచ్చు. అల్టిమస్ ప్రో ల్యాప్ టాప్ ధర రూ.11,990

ఏసర్ క్రోమోబుక్ 

బ్రౌజింగ్, స్ట్రీమింగ్, ఇతర పనులకు అసర్ క్రోమోబుక్ ల్యాప్ టాప్ చాలా బాగుంటుంది. దీనిలో ఇంటెల్ సెలెరన్ డ్యూయల్ కోర్ ఎన్ 4500 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 125 జీబీ స్టోరేజ్, క్రోమ్ ఓఎస్ తదితర ఫీచర్లు ఉన్నాయి. అంతర్నిర్మిత గూగుల్ అసిస్టెంట్, ఆటోమేటిక్ అప్ డేట్ లు, వేగవంతమైన కనెక్టివిటి, బ్లూటూత్ 5.0 కోసం వైఫై 6కి మద్దతు ఇస్తుంది. బహుళ యూఎస్ బీ టైప్ సి పోర్టులు, ఆకట్టుకునే డిజైన్, పది గంటల బ్యాటరీ లైఫ్ అదనపు ప్రత్యేకతలు.  అసర్ క్రోమోబుక్ ల్యాప్ టాప్ రూ.13,990కి అందుబాటులో ఉంది.

ఆసస్ వీవోబుక్ ఈ12

ఈ ల్యాప్ టాప్ లోని 11.6 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, కాంపాక్ట్ పోర్టబులిటీ తో స్పష్టమైన విజువల్ చూడవచ్చు.  ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ఎన్ 4000 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ ఉన్నాయి. మైక్రో ఎస్ డీతో స్టోరేజీని పెంచుకునే అవకాశం ఉంది. వైఫై, బ్లూటూత్ 4.1, కనెక్టివిటీ కోసం యూఎస్ బీ 3.1, హెచ్ డీఎంఐ పోర్టులు ఏర్పాటు చేశారు. పది గంటల బ్యాటరీ బ్యాకర్ అదనపు ప్రత్యేకత. బెబ్ బ్రౌజింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్, మీడియా వినియోగం తదితర పనులకు చాలా బాగుంటుంది. ఆసస్ వీవోబుక్ ఈ12 ల్యాప్ టాప్ ధర రూ.15,990.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..