
మెటా ఏఐ తాజాగా తన ఫీచర్ల శ్రేణిని అప్‌డేట్ చేస్తుంది. వినియోగదారుల కోసం మొట్టమొదటి వీడియో ఎడిటింగ్ ఎంపికను తీసుకువస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో వాట్సాప్‌ను ఎక్కువ మంది వినియోగదారులు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో వాడేలా మెటా ఏఐ వీడియో ఎడిటింగ్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. మెటా ఏఐ ఎంపిక చేసిన ప్రాంతాలకు ఈ కొత్త టూల్‌ను అందిస్తోంది. కానీ క్రమంగా ఎక్కువ మంది వినియోగదారులు దాని ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మెటా ఏఐ వెబ్‌సైట్‌లో, ఇటీవల ప్రవేశపెట్టిన ఎడిట్స్ యాప్‌లో వీడియో ఎడిటింగ్ టూల్ అందుబాటులో ఉందని మెటా తెలిపింది. వీడియో ఎడిటింగ్ కోసం కంపెనీ ఏఐ ప్రాంప్ట్‌ల ప్రీసెట్‌ను అభివృద్ధి చేసింది
ఈ ఏఐ ప్రాంప్ట్‌ల ద్వారా మీరు ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్‌లో షేర్ చేయడానికి అనువుగా దుస్తులు, స్థానం లేదా లైటింగ్‌ను కూడా మార్చడానికి ఉపయోగించవచ్చు. వీడియోలను సవరించడానికి ప్రజలు వారి సొంత టెక్స్ట్ ప్రాంప్ట్‌లను ఉపయోగించడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తుంది. ఈ ఫీచర్ ఏఐ మోడల్ సామర్థ్యాన్ని పెంచుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫీచర్ ఈ సంవత్సరం చివర్లో అందుబాటులోకి వస్తుంది.
ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత అనేది ఉంటుంది. కాబట్టి మెటా ఏఐ మీ ఆలోచనలకు అనుగుణంగా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మెచ్చేలా వీడియో ఎడిట్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆసక్తికరమైన వీడియోలను తయారు చేయడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ను రూపొందించామని మెటా తన పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఏఐ ఎడిటింగ్ టూల్ ఉచితంగా 10 సెకన్లకు పరిమితం చేశారు. ఈ వారం యాప్, వెబ్‌సైట్‌కు జోడించిన వీడియో ఫీచర్‌ను యూఎస్‌లోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి