Technology Tips: మీరు వాడుతున్న ఫోన్ ఛార్జర్ నకిలీదా..? లేక ఒరిజినల్‌దా? ఈ చిట్కాలతో ఎవరైనా ఈజీగా కనిపెట్టొచ్చు..

ఫోన్ కొనుగోలు చేసినప్పుడు ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఛార్జర్ అందించడం లేదు. దానిని బయట షాపులో అదనంగా డబ్బులు చెల్లించి తీసుకోవాల్సి వస్తుంది. మార్కెట్‌లో ఛార్జర్ తీసుకోవాలంటే వంద రకాలుగా భయపడాల్సి వస్తుంది. అది బ్రాండెడ్ ఛార్జరా..? లేకపోతే నకిలీదా అనే అనుమానం ఉంటుంది.

Technology Tips: మీరు వాడుతున్న ఫోన్ ఛార్జర్ నకిలీదా..? లేక ఒరిజినల్‌దా? ఈ చిట్కాలతో ఎవరైనా ఈజీగా కనిపెట్టొచ్చు..
Phone Chargers

Updated on: Dec 23, 2025 | 1:47 PM

టెక్నాలజీ రోజురోజుకు మరింతగా అభివృద్ది చెందుతున్న తరుణంలో అందరి చేతుల్లో మొబైల్ ఫోన్ అనేది ఉంటుంది. ఒక నిత్యావసర పరికరంగా కూడా ఇది మారిపోయింది. ఇతరులతో మాట్లాడాలన్నా, వర్క్ టాస్క్‌లు, బ్యాంకింగ్ లావాదేవీలు లేదా వినోదం కోసం ఫోన్ అనేది అందరూ వాడుతూ ఉంటారు. ఫోన్ వాడాలంటే ఛార్జింగ్ అనేది తప్పనిసరి. ఇంతకముందు ఫోన్‌తో పాటు కంపెనీలు ఛార్జర్లు కూడా అందించేవి. ఇప్పుడు కంపెనీలు ఛార్జర్లు ఇవ్వడం లేదు. బయట మార్కెట్‌లో వీటిని కొనుగోలు చేయడం మొబైల్ వినియోగదారులకు భారంగా మారింది. బయట మార్కెట్లో అనేక నకిలీ, డమ్మి ఛార్జర్లు చలామణి అవుతున్నాయి. వీటిని వాడటం ఫోన్‌కే ప్రమాదం. దీంతో నిజమైన ఛార్జర్లను ఎలా గుర్తించారో ఇప్పుడు తెలుసుకుందాం.

నిజమైన ఛార్జర్‌ను ఇలా గుర్తించండి

 

నకిలీ వాటితో పోలిస్తే ఒరిజినల్ ఛార్జర్లు కాస్త బరువుగా ఉంటాయి. ఒరిజినల్ ఛార్జర్ల తయారీకి బలమైన లోహం, అధిన నాణ్యత కలిగిన భాగాలు ఉపయోగిస్తారు. అదే నకిలీ చార్జర్లలో తక్కువ నాణ్యత కలిగిన పరికరాలు వాడతారు. అందుకే ఒరిజినల్ ఛార్జర్లు బరువుగా అనిపిస్తాయి. ఇక ఒరిజినల్ ఛార్జర్ల ప్లాస్టిక్ మ్యాట్ నునుపుగా ఒకేలా ఉంటుంది. కరుకుదనం, అంచులు లాంటివి కనిపించవు. ఒరిజినల్ ఛార్జర్లలో పిన్ కనెక్టర్లు ఒకేలా ఉంటాయి. అదే నకిలీ ఛార్జర్లలో పిన్ ప్లేస్‌మెంట్ వంకరగా ఉంటుంది. ఇక ఒరిజినల్ ఛార్జర్లపై బీఐఎస్ గుర్తు, భద్రతా సంకేతాలు స్పష్టంగా, బోల్డ్ లెటర్స్‌తో ఉంటాయి. అదే నకిలీ ఛార్జర్లలో ఆ గుర్తులు వంకరగా, సరిగ్గా కనిపించనట్లు ఉంటాయి.

ఈ యాప్‌ ఉపయోగించండి

కేంద్ర ప్రభుత్వం BIS కేర్ యాప్ తీసుకొచ్చింది. ఇందులో మనం కొనుగోలు చేయాలనుకునే ప్రొడక్టస్ వివరాలు తెలుసుకోవచ్చు. ఛార్జర్‌పై ఉండే ఉత్పత్తి రిజిస్ట్రేషన్ నెంబర్ యాప్‌లో ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు కనిపించాలి. కనిపించపోపతపే అది నకిలీ ప్రొడక్ట్ అని అర్థం. మీరు ఛార్జర్ కొనుగోలు చేసే సమయంలో బీఐఎస్ మార్క్ ఉందా, మోడల్, బ్యాచ్ నెంబర్ వంటివి చెక్ చేయండి. తక్కువకి వస్తుంది కదా అని బ్రాండెడ్ కానీ చార్జర్‌ను ఉపయోగించడం వల్ల మీ ఫోన్ సరిగ్గా పనిచేయదు. అంతేకాకుండా ఫోన్ వేడెక్కి పగిలిపోయే అవకాశం కూడా ఉంది.