Redmi Smartwatch: ఇదేం టెస్టింగ్ రా బాబు.. స్మార్ట్ వాచ్‌ను మూడు రోజులపాటు నీటిలో నానబెట్టేశారు.. ఆ తర్వాత ఏమైందంటే..

ప్రస్తుతం రెడ్ మీ వాచ్ 3 యాక్టివ్ స్మార్ట్ వాచ్ ను పలు విధాలుగా టెస్టింగ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఏకంగా స్మార్ట్ వాచ్ ను నీటిలో ముంచేసి, మూడు రోజుల వరకూ దానిని నీటిలోనే నానబెట్టారు. దాని విత్ స్టాండ్ బలాన్ని అంచనా వేసేందుకు ఇలా చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

Redmi Smartwatch: ఇదేం టెస్టింగ్ రా బాబు.. స్మార్ట్ వాచ్‌ను మూడు రోజులపాటు నీటిలో నానబెట్టేశారు.. ఆ తర్వాత ఏమైందంటే..
Redmi Watch 3 Active

Updated on: Jul 21, 2023 | 5:30 PM

సాధారణంగా టెక్ గ్యాడ్జెట్లు నీటిలో తడవకూడదు. వాటర్ రెసిస్టెన్స్ ఉన్నా గానీ ఎక్కువ సేపు నీటిలో ఉంటే దాని పనితీరుపై ప్రభావం పడుతుంది. కేవలం వర్షం, లేదా తక్కువ మోతాదులో నీటిలో తడవడం వరకూ ఓకే. కానీ ప్రముఖ టెక్ దిగ్గజం జియోమీ ఓ కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేస్తోంది. దీనిని ఏకంగా మూడు రోజుల పాటు నీటిలో ముంచేసి ఉంచి పరీక్షి చేస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ పేరు రెడ్ మీ వాచ్ 3 యాక్టివ్. దీనిలో అన్ని రకాల టెక్, హెల్త్ ఫీచర్లు ఉంటాయి. అలాగే వాటర్, డస్ట్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా జియోమీ విడుదల చేసింది. ప్రస్తుతం రెడ్ మీ వాచ్ 3 యాక్టివ్ స్మార్ట్ వాచ్ ను పలు విధాలుగా టెస్టింగ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఏకంగా స్మార్ట్ వాచ్ ను నీటిలో ముంచేసి, మూడు రోజుల వరకూ దానిని నీటిలోనే నానబెట్టారు. దాని విత్ స్టాండ్ బలాన్ని అంచనా వేసేందుకు ఇలా చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

రెడ్ మీ 3 వాచ్ యాక్టివ్..

గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ జియోమీ అంటే ఇప్పటి వరకూ స్మార్ట్ ఫోన్ల గురించే అందరికీ తెలుసు. కానీ జియోమీ తన మార్కెట్ ను విస్తరిస్తోంది. స్మార్ట్ వాచ్ లను కూడా విరివిగా ఉత్పత్తి చేసి, మార్కెట్లోకి విడుదల చేస్తోంది. అందులో భాగంగానే రెడ్‌మి వాచ్ 3 యాక్టివ్‌ను టీజ్ చేసింది, ఇది వచ్చే నెల ప్రారంభంలో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో ఆవిష్కరించడానికి అంతా సిద్ధం చేసింది. తాజా రెడ్‌మీ స్మార్ట్‌వాచ్ ఫీచర్-రిచ్ ప్రాడక్ట్ గా తీసుకొస్తోంది.

కఠినమైన పరీక్షలు..

వినియోగదారులకు ‘పర్ఫెక్ట్ అవుట్‌డోర్ కంపానియన్’గా ఈ రెడ్ మీ కొత్త స్మార్ట్ వాచ్ ను మార్చడానికి కంపెనీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం కొన్ని కఠినమైన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే వాటర్ టెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. అంటే నీటిలో ముంచేసి దాదాపు మూడు రోజులపాటు అలాగే ఉంచి, దాని పనితీరుపై అధ్యయనం చేసినట్లు వివరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆగస్ట్ 1 లాంచ్ ఈవెంట్‌లో వెల్లడయ్యే అవకాశం ఉంది. దీని కోసం కంపెనీ ఇప్పటికే ఆహ్వానాలను పంపింది. కంపెనీ అప్‌లోడ్ చేసిన మునుపటి వీడియోలో, జియోమీ అభిమానులు, జియోమీ ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ చేతుల మీదుగా స్మార్ట్ వాచ్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్బంగా జీయోమీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుజ్ శర్మ మాట్లాడుతూ రెడ్ 12కి కొనసాగింపుగా ఈ రెడ్ మీ వాచ్ 3 యాక్టివ్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ప్రధాన స్పెసిఫికేషన్లు ఇవి..

ఈ రెడ్ మీ వాచ్ 3 యాక్టివ్ స్మార్ట్ వాచ్ లో 240×280 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగిన 1.83 అంగుళా ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా వాచ్ నుంచే నేరుగా ఫోన్లు మాట్లాడుకోవచ్చు. రన్నింగ్, ట్రెడ్ మిల్, అవుట్ డోర్, సైక్లింగ్, వాకింగ్, ట్రెక్కింగ్ వంటి అనేక రకాల స్పోర్ట్స్ మోడ్లు ఈ స్మార్ట్ వాచ్ లో ఉంటాయి. దీనిలో 289 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 12 గంటలు ఆగకుండా పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..