Xiaomi Bumper Offer: ప్రంపచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ షావోమీ ఎంఐ సంస్థ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. యాక్ససరీస్ బొనాంజా పేరుతో తగ్గింపు ధరలకే స్మార్ట్‌వాచ్, ఇయర్‌ఫోన్స్, స్మార్ట్‌బ్యాండ్స్ ఇతర యాక్సెసరీస్‌ని అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లతో ఇండియా మార్కెట్‌లోకి ఎంటరైన షావోమి సంస్థ ఇక్కడ బలంగా పాతుకుపోయింది. స్మార్ట్‌ఫోన్లతో పాటు ల్యాప్‌ట్యాప్స్, బ్యాగ్స్, స్మార్ట్ వాచెస్, ఇయర్‌ఫోన్స్, పాకెట్ స్పీకర్స్ ఇతర యాక్సెసరీస్‌ని ఇక్కడి ప్రజలకు పరిచయం చేసింది. తక్కువ ధరకే నాణ్యమైన ప్రోడక్ట్స్ అందిస్తుండంతో ఎంఐకి ఇండియాలో భారీ కస్టమర్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం కస్టమర్ల కోసం యాభై శాతం డిస్కౌంట్‌తో యాక్సెసరీస్ అందిస్తోంది. నవంబరు 13, 14 తేదీల్లో ప్రత్యేకంగా యాక్సెసరీస్ బొనాంజా సేల్స్ ప్రకటించింది.
ఎంఐ యాక్సెసరీస్ బొనాంజా సేల్స్‌లో భాగంగా స్మార్ట్‌వాచ్ రివాల్వ్‌పై అత్యధికంగా 8 వేల రూపాయల తగ్గింపు అందిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ఎంఆర్‌పీ ధర రూ.15,999లు ఉండగా ఈ ఆఫర్‌లో కేవలం రూ.7,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్ ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఎంఐ ఇయర్‌ఫోన్ ఎంఆర్‌పీ ధర రూ.999 ఉండగా ప్రత్యేక తగ్గింపుగా రూ.199కే వస్తోంది. ఎంఐ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ బేసిక్ ధర రూ.1,799 ఉండగా ఈ ఆఫర్‌లో రూ.499కే వస్తోంది. ఎంఐ స్మార్ట్‌బ్యాండ్ 4 ధర రూ.2, 499 ఉండగా యాక్సెసరీస్ బొనాంజా సేల్స్‌లో రూ.1,599కి అందిస్తోంది. రెడ్‌మీ స్మార్ట్‌బ్యాండ్ ధర రూ.2, 099లు కాగా ఈ ఆఫర్‌లో రూ.1299కే వస్తోంది. ఎంఐ పాకెట్ స్పీకర్ ధర రూ.1,499 ఉండగా ఇప్పుడు రూ.799కే లభిస్తోంది.. ఎంఐ ప్రొటెక్టివ్ గ్లాస్ ధర రూ.599 కాగా ఆఫర్‌లో రూ.49కే అందుబాటులో ఉంది.
Also read:
Chanakya Niti: ఈ ఐదు విషయాలను అనుసరించండి.. మీ జీవితం పూల బాటే..