
మంచి కెమెరా కలిగిన ఫోన్ కోసం ఎదురుచూస్తున్న మొబైల్ ప్రియులకు ఇది గుడ్‌న్యూస్. Xiaomi నుంచి అదిరిపోయే కెమెరాతో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. అప్‌గ్రేడ్ చేసిన బ్యాటరీ, ప్రాసెస్ తోపాటు 200ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాతో Xiaomi 17 Ultra లాంఛ్ అయ్యింది. ఈ హ్యాండ్ సెట్ ధర, ప్రత్యేకతలకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.
Xiaomi 15 Ultra అప్‌గ్రేడ్ వెర్షన్ అయిన Xiaomi 17 Ultraను తమ కస్టమర్ల కోసం లాంఛ్ చేసింది. పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త మోడల్ అప్‌గ్రేడ్ బ్యాటరీ, ప్రాసెసర్, కెమెరాతో వస్తోంది. ఫీచర్ల పరంగా చూస్తే Xiaomi 17 Ultra క్వాల్కమ్ ఫ్లాగ్ షిప్ ఆక్ట్రా-కోర్ ప్రాసెస్ ద్వారా పవర్ ఫుల్‌గా ఉంది. ఈ ఫోన్లో 200 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా సెన్సార్ అమర్చారు. దీంతో ఫొటోల క్లారిటీ అద్భుతంగా ఉండనుంది.
డిస్‌ప్లే: ఈ ఫోన్ 6.9 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1060 nits పీక్ బ్రైట్నెస్ కు సపోర్ట్ ఇస్తోంది.
చిప్‌సెట్: ఈ హ్యాండ్‌సెట్‌లో క్వాల్కమ్ 3ఎన్ఎం స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ తోపాటు అడ్రినో 840 జీపీయూ అమర్చడటంతో స్పీ్డ్, మల్టీటాస్కింగ్‌కు ఎలాంటి ఢోకా లేదు.
కెమెరా సెటప్: ఈ ఫోన్లో లైకా-ట్యూన్ చేసిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగా పిక్సెల్ LOFIC ఓమ్ని విజ్ 1050L ప్రైమరీ సెన్సార్, 50 మెగా పిక్సెల్ సాంసంగ్ జేఎన్5 ఆల్ట్రావైడ్ కెమెరా, 200 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా 50 మెగా పిక్సెల్ OV50M కలిగివుంది.
బ్యాటరీ: 6800mAh బ్యాటరీతో ఫోన్‌ను మరింత పవర్ ఫుల్‌గా మార్చారు. అంతేగాక, ఈ హ్యాండ్‌సెట్ 90w వైర్డ్, 50w వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Xiaomi 17 Ultra ఫోన్ ధర విషయానికొస్తే 12జీబీ/512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 90,000, 16GB RAM/512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 96,000), 16GB/TB వేరియంట్ ధర సుమారు రూ. 1,09,000)గా ఉంది. Xiaomi 17 Ultra Leica ఎడిషన్ 16GB/512GB వేరియంట్ ధర సుమారు రూ. 1,02,000, 16GB/1TB వేరియంట్ ధర సుమారు రూ. 1,15,000గా ఉంది. ఈ ధరకు Xiaomi 17 Ultraను భారత మార్కెట్లోకి విడుదల చేస్తే.. Samsung Galaxy Z Flip6 5G, Samsung Galaxy Z Fold5, OPPO Find X8 Pro 5G, iPhone 17 లకు గట్టి పోటీని ఇస్తుంది. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్ రానుంది.