Xiaomi: మార్కెట్లో రోజురోజుకు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదలవుతున్నాయి. ఇక షియోమి నుంచి ఎన్నో ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. షియోమి వాచ్ ఎస్1 సిరీస్, బడ్స్ 3టీ ప్రొ ఇయర్ ఫోన్స్‌తో పాటు గ్లోబల్ మార్కెట్ (Global Market)లో షియోమి 12 సిరీస్ విడుదలైంది. ఎంఐ 11 సిరీస్‌కు కొనసాగింపుగా ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ (Flagship Phone)సిరీస్‌ను షియోమి మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో టాప్ఎండ్ స్పెసిఫికేషన్స్‌తో షియోమి 12, 12 ప్రొ కస్టమర్లను ఆకట్టుకుంటాయని కంపెనీ భావిస్తోంది.
ఇక షియోమి 12 సిరీస్ ఇండియా విడుదల గురించి కంపెనీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గత సంవత్సరం షియోమి 11 సిరీస్ అల్ట్రా మోడల్‌ను భారత్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఇక న్యూ స్మార్ట్‌ఫోన్ 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌తో 4600ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కేవలం 18 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అవుతుంది. ఇ ఫోన్ సైజు 6.73 అంగుళాల డిస్‌ప్లేతో 256జీబీ స్టోరేజీతో అందుబాటులోకి రానుంది. హైఎండ్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ కస్టమర్ల ముందుకొచ్చింది. ఇక షియోమి 12 సిరీస్ రూ 57,210 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి: