Flying Bike: రయ్..రయ్.. లేచిపోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం.. ఎలానో మీరే చూడండి..

Air Bike: ఒకప్పుడు డూమ్ టీవీలు ఉండేవి... ఇప్పుడు ప్లాస్మాలు... ఒకప్పుడు కేబుల్ టీవీలు.. ఇప్పుడు డిష్ యాంటెన్నాలు.. టెక్నాలజీ మారుతోంది. బైక్ గాల్లోకి ఎగరడం ఎప్పుడైనా చూశారా..? సినిమాల్లో, యాక్సిడెంట్లు జరిగినప్పుడు చాలాసార్లు చూశామని మీరు అనుకోవచ్చు. కానీ వేగంగా వెళ్తున్న బైక్ ఉన్నట్లుండి హెలికాప్టర్‌లాగా గాల్లోకి ఎగిరి ప్రయాణించడం చూశారా? అయితే ఇప్పుడు చూసేయండి..! ఆ కథేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Flying Bike: రయ్..రయ్.. లేచిపోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం.. ఎలానో మీరే చూడండి..
Flying Bike

Updated on: Sep 19, 2022 | 4:56 PM

దేశ రాజధాని ఢిల్లీలో నివసించేవారు ఏడాది కాలంలో 209 గంటలు ట్రాఫిక్‌లో వృధా చేసుకుంటున్నారనే సంగతి  తెలుసా. మీరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు.. ఎగిరి గంతేసే అలాంటి బైక్ లేదా కారు ఉంటే బాగుండేదని మీరు ఎప్పుడో ఒకప్పుడు అనుకుని ఉంటారు. అయితే ఇప్పుడు ఇదే నిజం కాబోతోంది. ఇప్పుడు గాలిలో తేలికగా ఎగరగలిగే బైక్‌ను తయారు చేశారు. రాబోయే కాలంలో ఎగిరే కార్లు, బైక్‌లను ఉపయోగించబోతున్నారు. ఎగిరే కార్ల గురించిన వార్తలు తరచూ చదువుతున్నాం. ఇప్పుడు ప్రపంచంలోనే తొలి ఎగిరే బైక్ కూడా వచ్చేసింది. వాస్తవానికి, జపాన్‌కు చెందిన AERQINS కంపెనీ.. వచ్చే ఏడాది USAలో హోవర్‌ బైక్ (Flying Bike)ని విడుదల చేయబోతోంది. అమెరికాలో జరిగిన ఆటో షోలో ఈ బైక్‌ను ప్రదర్శించారు. సూపర్‌బైక్‌లా కనిపించే ఈ బైక్‌లోని అతి పెద్ద విశేషం ఏంటంటే.. ఇది గాలిలో ఎగురుతుంది.  ఇటీవలే ఈ బైక్‌ను డెట్రాయిట్ ఆటో షోలో ప్రదర్శించింది. ఇప్పుడు ఎగిరే బైక్ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇందులో ఒక వ్యక్తి బైక్‌పై కూర్చుని గాలిలో తిరుగుతున్నట్లు మనం చూడవచ్చు.

ఈ బైక్‌కి ఎక్స్‌టూరిస్మో అని పేరు పెట్టారు. Aerwins Xturismo hoverbike బహుళ ప్రొపెల్లర్లను (ఎగిరే ప్రయోజనాల కోసం రూపొందించిన ఫ్యాన్ లాంటి పరికరం) ఉపయోగించి నేల నుంచి గాలిలోకి ఎగిరింది. ఇది నాలుగు చిన్న ప్రొపెల్లర్‌లతో పాటు ముందు, వెనుక రెండు పెద్ద ప్రొపెల్లర్‌లను కలిగి ఉంది. పెద్ద ఫ్యాన్‌లు హోవర్‌బైక్‌కి లిఫ్ట్‌ను అందిస్తాయి. చిన్నవి స్టెబిలైజర్‌లుగా పనిచేస్తాయి.

Aerwins XTurismo 3.7 m (146 in) పొడవు, 2.4 m (94.5 in) వెడల్పు, 1.5 m (59 in) ఎత్తు. ఇది గరిష్టంగా 60 mph (97 kph) వేగంతో 30 నుంచి 40 నిమిషాల పాటు గాలిలో ప్రయాణించగలదు. బైక్ బరువు 300 కిలోలు. ఇందులో కార్బన్ ఫైబర్ మెటీరియల్ ఉపయోగించబడింది. ఇది 100 కిలోల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ బైక్ ఇప్పటికే జపాన్‌లో అమ్మకానికి ఉంది. వచ్చే ఏడాది యునైటెడ్ స్టేట్స్‌లో విక్రయించడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ ఎగిరే బైక్ ధర 777,000 డాలర్లు (దాదాపు రూ. 6.19 కోట్లు). 

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం