Wired vs Wireless Mouse: వైర్డ్ మౌస్ Vs వైర్‌లెస్ మౌస్.. ఫాస్ట్ వర్క్‌కి ఏది బెస్ట్..?

కంప్యూటర్‌కి ఏ మౌస్ బెస్ట్..? వైర్డ్ మౌస్ లేదా వైర్‌లెస్ మౌస్.. ఏది కొంటే మీ పని సూపర్ స్పీడ్‌గా పూర్తవుతుంది..? దూరం నుంచి కూడా లాప్‌టాప్‌ను ఆపరేట్ చేసే వైర్‌లెస్ మౌస్‌లో అసలు లోపం ఏంటీ..? బ్యాటరీ, ధర సమస్య పక్కన పెడితే.. వేగం విషయంలో రెండింటిలో ఏది బెస్ట్..? అనేది తెలుసుకుందాం..

Wired vs Wireless Mouse: వైర్డ్ మౌస్ Vs వైర్‌లెస్ మౌస్.. ఫాస్ట్ వర్క్‌కి ఏది బెస్ట్..?
Wired Vs Wireless Mouse

Updated on: Oct 16, 2025 | 6:57 PM

కంప్యూటర్‌కు మౌస్ కంపల్సరీ.. మౌస్ లేకపోతే సిస్టమ్ ఉపయోగించలేం. ల్యాప్‌టాప్‌కు కూడా చాలా మంది మౌస్ వాడతారు. అయితే మౌస్ కొనేటప్పుడు చాలా మందికి కొన్ని డౌట్లు ఉంటాయి. వైర్డు మౌస్ కొనాలా లేక వైర్‌లెస్ మౌస్ కొనాలా..? ఈ రెండింటిలో ఏది మంచిది..? అనేది తెలుసుకుందాం..

వైర్డు మౌస్..

వైర్డ్ మౌస్ వైర్‌లెస్ మౌస్ కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. మీరు క్లిక్ చేసిన వెంటనే కంప్యూటర్‌లో రియాక్షన్ ఉంటుంది. అందుకే గేమ్స్ ఆడేవాళ్లు, గ్రాఫిక్ డిజైనింగ్ చేసేవాళ్లు దీన్నే ఎక్కువగా వాడతారు. దీనికి బ్యాటరీ పెట్టాల్సిన పని లేదు. కరెంట్ నేరుగా ల్యాప్‌టాప్/కంప్యూటర్ నుంచే తీసుకుంటుంది. ఇది సాధారణంగా వైర్‌లెస్ మౌస్ కంటే తక్కువ ధరకే దొరుకుతుంది. దీని వైర్ మీ డెస్క్ అంతా అడ్డంగా ఉండి చిరాకు తెప్పిస్తుంది. కంప్యూటర్ పక్కనే కూర్చుని వాడాలి. దూరం నుంచి వాడలేరు.

ఇవి కూడా చదవండి

వైర్‌లెస్ మౌస్..

వైర్‌లెస్ మౌసుకు వైర్ ఉండదు కాబట్టి దూరం నుంచి కూడా లాప్‌టాప్‌ను ఆపరేట్ చేయొచ్చు. మీ టేబుల్ చాలా చక్కగా, శుభ్రంగా కనిపిస్తుంది. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇది పనిచేయాలంటే బ్యాటరీ తప్పనిసరి. బ్యాటరీ అయిపోతే మళ్లీ మార్చాలి. ఇది వైర్డు మౌస్ కంటే కొంచెం ఖరీదైనది. వేగంగా కదలాల్సిన గేమింగ్‌కి ఇది కొన్నిసార్లు కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు.

చివరిగా.. ఎవరికి ఏది బెస్ట్?

మీరు స్టూడెంట్, సాధారణ యూజర్, గేమర్ అయితే వైర్డు మౌస్ బెస్ట్. ఇది తక్కువ రేట్‌లో లభిస్తుంది. వేగంగా పనిచేస్తుంది. మీరు ఆఫీస్ ఉద్యోగి లేదా ప్రయాణం ఎక్కువ చేసేవారు అయితే వైర్‌లెస్ మౌస్ బెస్ట్. వైర్ ఉండకపోవడంతో ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ రెండింటిలో మీ అవసరాన్ని బట్టే మీ ఎంపిక ఉండాలి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..