Flipkart Winter Sale: ఫ్లిప్‌కార్ట్‌లో వింటర్‌ ఫెస్ట్‌ సేల్‌ షురూ.. స్మార్ట్‌ఫోన్స్‌పై అదిరే డిస్కౌంట్లు

| Edited By: TV9 Telugu

Dec 28, 2023 | 4:59 PM

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌తో మన ముందుకు వచ్చిన ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం వింటర్ ఫెస్ట్ సేల్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా ఈ సేల్‌లో వివిధ బడ్జెట్ వర్గాల్లో విస్తృత శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లపై గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. అలాగే ఈ సేల్‌ డిసెంబర్ 31, 2023 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్లపై ఉన్న ఆఫర్ల గురించి ఓసారి తెలుసుకుందాం. 

Flipkart Winter Sale: ఫ్లిప్‌కార్ట్‌లో వింటర్‌ ఫెస్ట్‌ సేల్‌ షురూ.. స్మార్ట్‌ఫోన్స్‌పై అదిరే డిస్కౌంట్లు
Online Shopping
Follow us on

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ మార్కెట్‌ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి సైట్లల్లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గతంలో మెట్రో ప్రాంతాలకే పరిమతిమైన ఆన్‌లైన్‌ ఆర్డర్లు ఇప్పుడు గ్రామీణులు చెంతకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సేల్స్‌ ప్రకటిస్తూ ఆయా సైట్‌లు ప్రజల అభిమానాన్ని పెంచుకుంటున్నాయి. గతంలో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌తో మన ముందుకు వచ్చిన ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం వింటర్ ఫెస్ట్ సేల్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా ఈ సేల్‌లో వివిధ బడ్జెట్ వర్గాల్లో విస్తృత శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లపై గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. అలాగే ఈ సేల్‌ డిసెంబర్ 31, 2023 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్లపై ఉన్న ఆఫర్ల గురించి ఓసారి తెలుసుకుందాం. 

ఐఫోన్‌ 14 తగ్గింపులు

స్టాండ్‌అవుట్ డీల్స్‌లో భాగంగా ఐఫోన్‌ 14 సిరీస్‌పై ఆకట్టుకునే డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఐఫోన్ 14కు సంబంధించిన బేస్‌ మోడల్ 128 జీబీ నిల్వను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఈ సేల్‌ రూ. 57,999 తగ్గింపు ధరతో జాబితా చేశారు. అలాగే ఐఫోన్ 14 ప్లస్ అసలు ధర రూ. 89,900 ఉండగా 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.65,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఈ తగ్గింపులు పొందాలంటే ఎలాంటి షరత్తులు లేవు. వినియోగదారులకు నేరుగా ఫ్లాట్ తగ్గింపును అందిస్తాయి. 

ఇవి కూడా చదవండి

ఇతర ఫోన్‌లపై ఆఫర్లు ఇలా

  • ఫ్లిప్‌కార్ట్‌ వింటర్ ఫెస్ట్ సేల్ పోకో సీ 55పై తగ్గింపులను అందిస్తుంది. ఫిబ్రవరిలో రిలైజైన ఈ ఫోన్‌ 4 జీబీ + 64 జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 9,499గా ఉండగా ప్రస్తుతం రూ. 6,499 వద్ద అందుబాటులో ఉంది. అదనంగా రూ. 10,999 వద్ద మార్కెట్లో ఉన్న 6 జీబీ + 128 జీబీ కాన్ఫిగరేషన్ ఇప్పుడు రూ. 7,499 వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. 
  • ఈ సేల్‌లో సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 14 5జీ రూ.11,990 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. 
  • మోటరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్‌ను రూ. 22,999 తగ్గింపు ధరలో అందుబాటులో ఉంది. 
  • వివో టీ 2 5 జీ ఫోన్‌ ఈ సేల్‌లో రూ. 16,999 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.
  • ఫ్లిప్‌కార్ట్ వింటర్ ఫెస్ట్ సేల్ 2023లో భాగంగా రెడ్‌మి నోట్ 12 ప్రో ఫోన్‌ రూ.21,999కు అందుబాటులో ఉంది. 
  • సామ్‌సంగ్‌ గెలాక్స్‌ ఎఫ్‌ 34 5జీ ఫోన్‌ రూ.18,499కు కొనుగోలు చేయవచ్చు. 
  • అలాగే పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్‌ను రూ.10,999కు సొంతం చేసుకోవచ్చు.
  • ఫ్లిప్‌కార్ట్‌ వింటర్ ఫెస్ట్ సేల్ 2023లో గూగుల్‌ పిక్సెల్‌ 7ఏ ఫోన్‌పై రూ.38,999కు కొనుగోలు చేయవచ్చు.
  • అలాగే పోకో ఎక్స్‌ ప్రో ఫోన్‌పై రూ.16,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..