
వాట్సాప్.. ఇది వాడని వారు చాలా తక్కువ. వాట్సన్ వచ్చిన నుంచి మనుషులతో మాట్లాడడమే తగ్గించేశారు. ఏదైనా మెసేజ్ చేస్తున్నారు. మనిషి జీవితంతో ఇది పెనవేసుకపోయింది. అటు మెటా కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తూ వాట్సాప్‌ను అందరికీ ఈజీగా మారుస్తుంది. చదవురు రాని వాళ్లు సైతం వాట్సప్‌ను ఈజీగా వాడగలుగుతున్నారు. రీసెంట్‌గా రిమైండ్ మీ ఫీచర్ తీసుకొచ్చి.. ఇంపార్టెంట్ చాట్స్‌ను మర్చిపోకుండా చేసింది. ఈ క్రమంలో మెటా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యూ వన్స్ ఆప్షన్‌ను మరింత పటిష్ఠం చేసింది. మూడేళ్ల క్రితం మెటా వ్యూ వన్స్ ఆప్షన్ తీసుకొచ్చింది. వ్యూ వన్స్’ ఆప్షన్ ద్వారా పంపిన ఫొటోలు, వీడియోల స్క్రీన్‌షాట్‌లు తీయకుండా నిరోధించింది. అయినా కొన్ని లొసుగులను ఉపయోగించి వాటిని క్యాప్చర్ చేశారు. ఈ క్రమంలో స్క్రీన్‌షాట్-బ్లాకింగ్ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది.
వాట్సాప్’వ్యూ వన్స్ ఫీచర్ ఒకసారి మాత్రమే చూడడానికి వీలు కల్పిస్తుంది. స్క్రీన్‌షాట్‌లను బ్లాక్ చేసినా.. కొంతమంది స్క్రీన్ రికార్డులను ఉపయోగించి వాటిని రికార్డ్ చేసేవారు. దీంతో అటువంటి వాటికి తావు ఇవ్వకుండా వ్యూ వన్స్ మెసేజ్‌ల స్క్రీన్ రికార్డింగ్‌ను కూడా నిలిపివేసింది. వ్యూ వన్స్ ఆప్షన్‌ను ఉపయోగించి చిత్రాన్ని లేదా వీడియోను పంపినప్పుడు.. దాన్ని క్యాప్చర్ చేయలేరు. ఎవరికీ ఫార్వర్డ్ కూడా చేయలేరు. అంతేకాదు రెండోసారి వారు కూడా చూడలేరు.
కొంతమంది ఇప్పటికీ రకరకాల పద్ధతులతో వ్యూ వన్స్ ఆప్షన్ ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేస్తున్నారు. ప్రధానంగా మరో ఫోన్ ఉపయోగించి వాటిని పిక్స్, వీడియో తీస్తున్నారు. మరోవైపు అన్‌వాంటెడ్ కాంటాక్ట్‌లను బ్లాక్ చేయడానికి మెటా మరిన్ని షార్ట్‌కట్‌లను తీసుకొచ్చింది. వీటితో పాటు మరికొన్ని ఫీచర్స్‌ను తెచ్చే పనిలో నిమగ్నమైంది. వాయిస్ నోట్స్‌ను స్టేటస్ గా పెట్టుకునే ఆప్షన్ తీసుకరానుంది. అదేవిధంగా యూజర్స్ ఎటువంటి కంప్రెషన్ లేకుండా ఫొటోలు ఒరిజినల్ క్వాలిటీలో పంపొచ్చు. ఫొటోల నుంచి డైరెక్ట్ టెక్ట్స్ వచ్చే ఆప్షన్ ను కూడా మెటా డెవలప్ చేస్తోంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..