WhatsApp to Stop Working : కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన వేళ యూజర్లకు వాట్సప్ షాక్ ఇచ్చింది. ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే పలు ఫోన్లలో వాట్సప్ పని చేయడం లేదు. మిలియన్ల కొద్ది పాత ఫోన్లలో వాట్సప్ మేసేజింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దాంతో యూజర్లు డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే, ప్రతి ఏటా పాత ఓఎస్ వెన్షన్ మొబైళ్లకు వాట్సప్ సేవలను నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా వాట్సప్ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుని అప్లై చేసేసింది. ఈ విషయాన్ని వాట్సప్ యాజమాన్యం తొలి నుంచీ చెబుతూనే ఉంది. కాగా, వాట్సప్ పని చేయని మొబైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
వాట్సప్ పనిచేయని మొబైళ్ల ఇవే..
ఐఓఎస్ 9 (IOS-9) కన్నా.. పాత వెర్షన్ ఐఫోన్వాడుతున్న వారికి వాట్సాప్ సేవలు ఆగిపోయాయి.
ఐఫోన్ 4ఎస్, 5, 5ఎస్, 5సీ, 6, 6ఎస్ (iPhone 4S, 5, 5S, 5C, 6 and 6S) వంటి ఫోన్లలో ఈ మేసేజింగ్ యాప్ పూర్తిగా పని చేయడం లేదు.
ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్కన్నా పాత వెర్షన్తో నడుస్తున్న వాటిలో నేటి నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి.
Also read:
Coronavirus Alert : సూర్యాపేటలో కరోనా కన్నెర్ర..ఒక కుటుంబంలో ఏకంగా 22 మందికి వైరస్ పాజిటివ్