ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు అప్పుడప్పుడూ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి ఆశ్చర్యపరచడమే కాకుండా కొన్నిసార్లు కఠినమైన పరిమితులు పెట్టి షాక్‌కు కూడా గురి చేస్తుంది. రీసెంట్‌గా వాట్సాప్ తన వినియోగదారులకు ఒక హెచ్చరికను జారీ చేసింది.
అసభ్యకరమైన, హింసను ప్రేరేపించే విధంగా ఉండే ఎటువంటి పదాలతోనైనా గ్రూప్ పేర్లు గానీ, అకౌంట్ పేర్లను గానీ పెట్టుకుంటే తక్షణమే ఆ గ్రూపులను బ్యాన్ చేస్తోంది. ఇప్పటికే అలాంటి పేర్లతో ఉన్న పలు అకౌంట్లు, గ్రూపులను పర్మినెంట్‌గా బ్యాన్ చేసి… యూజర్లు తమ అకౌంట్లు, గ్రూపులకు పెట్టే పేర్లు ఆమోదయోగ్యం అయినవి ఉండాలని సూచిస్తోంది.
ఏది ఏమైనా వాట్సాప్‌లో అకౌంట్ గానీ, గ్రూప్ గానీ ఒకసారి బ్యాన్ అయితే.. మళ్ళీ తిరిగి పొందటం అసాధ్యం.. అందుకే వినియోగదారులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.