Whatsapp: ‘డు నాట్‌ డిస్టర్బ్‌’… వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌.. ఇకపై ఆ సమస్యకు చెక్‌..

|

Jun 22, 2022 | 8:39 AM

Whatsapp: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ఈ యాప్‌కు ఇంత క్రేజ్‌ ఉంది...

Whatsapp: డు నాట్‌ డిస్టర్బ్‌... వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌.. ఇకపై ఆ సమస్యకు చెక్‌..
Follow us on

Whatsapp: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ఈ యాప్‌కు ఇంత క్రేజ్‌ ఉంది. వినియోగదారుల ఆసక్తి, అవసరాలకు అనుగుణంగా ఫీచర్లను తీసుకొస్తున్నారు. ప్రత్యర్థి సంస్థల నుంచి వస్తోన్న పోటీని తట్టుకునే క్రమంలో ఇటీవల వాట్సాప్‌ కొన్ని ప్రత్యేక ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆకట్టుకునే ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్‌ ద్వారా సమాచార మార్పిడి ఎంత సులభంగా మారిందో అదే స్థాయిలో వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

ముఖ్యంగా వాట్సాప్‌లో వచ్చే నోటిఫికేషన్స్‌ పెద్ద సమస్యగా మారుతోంది. లెక్క లేనన్ని గ్రూప్స్‌ కారణంగా నిత్యం ఏదో ఒక మెసేజ్‌ అలర్ట్‌ వస్తూనే ఉంటుంది. దీంతో పదే పదే ఫోన్‌ చూడాల్సి వస్తోంది. ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోతోంది. దీంతో ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. బీటా అప్‌డేట్‌లో భాగంగా ‘డు నాట్‌ డిస్టర్బ్‌’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌, మెసేజ్‌ నోటిఫికేషన్లను బ్లాక్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. వాట్సాప్‌ బీటా ఇన్ఫోలో ఈ వివరాలను తెలిపారు.

ముఖ్యంగా వాహనం నడుపుతున్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు ఎలాంటి నోటిఫికేషన్లు రాకుండా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకునేందుకు టైమ్‌ కూడా సెట్‌ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎంచుకున్న సమయంలో ఎలాంటి అలర్ట్స్‌ రాకుండా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ప్రస్తుతానికి ఐఓఎస్‌ 15తో నడిచే ఐఫోన్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మరికొన్ని రోజుల్లోనే ఆండ్రాయిడ్‌ యూజర్లకు కూడా ఈ ఫీచర్‌ను పరిచయం చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..