ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ ఆప్ ఏదైనా ఉంది అంటే అది వాట్సాప్ అని చెప్పడంలో సందేహం లేదు. అంతలా పాపులారిటీ సంపాదించుకుందీ యాప్. ఇక ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్ నుంచి పోటీ వస్తున్నా తట్టుకొని యూజర్లు చేజారిపోకుండా చూసుకుంటోంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వాట్సాప్ తాజాగా మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది.
టెలిగ్రామ్‌కు చెక్ పెట్టే దిశగా వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్ ఛానల్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ సహాయంతో వివిధ రకాల కంటెంట్‌కు సంబంధించి సపరేట్ చానల్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే, ఈ చానల్స్ నుండి ప్రాధాన్యతల ఆధారంగా డేటా పొందవచ్చు. అప్‌డేట్స్ అనే కొత్త ట్యాబ్‌ను ఇందుకోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో యూజర్లు వివిధ రంగాలకు సంబంధించి.. షాపింగ్, కొత్త ప్రొడక్ట్స్, స్పోర్ట్స్ ఇలా వివిధ రకాల అప్‌డేట్స్ కోసం చానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ చానల్స్ ఫాలో అయ్యే యూజర్లు వాటికి సంబంధించిన అప్‌డేట్స్‌ను డైరెక్ట్‌గా ఆ చానల్స్ ద్వారా పొందుతారు.
ఇలాంటి ఫీచర్ ఇప్పటికే టెలిగ్రామ్ యాప్‌లో అందుబాటులో ఉంది. అయితే దీనికి పోటీగా వాట్సాప్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి ఈ కొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. వాట్సాప్ సర్వర్‌లలో చానల్ హిస్టరీని 30 రోజుల వరకు మాత్రమే స్టోర్ అవుతుంది. అడ్మిన్‌లకు పూర్తి కంట్రోలింగ్ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొలంబియా, సింగపూర్‌లో అందుబాటులో ఉంటుంది. రాబోయే నెలల్లో ఈ ఫీచర్ మరిన్ని దేశాల్లో అందుబాటులోకి రానుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..