Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్‌.. పొరపాటున కూడా ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయకండి.. చేశారో ఇక అంతే..

|

Jul 12, 2022 | 4:13 PM

Whatsapp: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్స్‌లలో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుంది. ఈ యాప్‌లో ఉండే ఫీచర్లు, యూజర్‌ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టం.. దీనిని మొదటి స్థానంలో నిలిపింది. ఈ యాప్‌ను ఎక్కువ మంది ఉపయోగిస్తుండడంతో దీనినే..

Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్‌.. పొరపాటున కూడా ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయకండి.. చేశారో ఇక అంతే..
Follow us on

Whatsapp: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్స్‌లలో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుంది. ఈ యాప్‌లో ఉండే ఫీచర్లు, యూజర్‌ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టం.. దీనిని మొదటి స్థానంలో నిలిపింది. ఈ యాప్‌ను ఎక్కువ మంది ఉపయోగిస్తుండడంతో దీనినే ఆయుధంగా మార్చుకొని సైబర్ నేరగాళ్లు యూజర్లను టార్గెట్‌ చేస్తున్నారు. వాట్సాప్‌ అందించే సేవలను పోలినట్లే ఉన్న మరికొన్ని నకిలీ యాప్‌లను వాట్సాప్‌ పరిశోధన బృందం తాజాగా గుర్తించింది. ఈవిషయాన్ని వాట్సాప్‌ హెడ్‌ విల్‌ క్యాత్‌ కార్ట్‌ ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. హేమోడ్స్ అభివృద్ధి చేసిన ‘హే వాట్సాప్’ అనే యాప్ చాలా ప్రమాదకరమైనదని క్యాత్ కార్ట్ వివరించారు.

ఇలాంటి యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లో డౌన్‌లోడ్‌ చేసుకోకూడదని ఆయన సూచించారు. ఈ నకిలీ యాప్స్‌ ద్వారా కొన్న ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నట్లు తాము గుర్తించామని తెలిపిన క్యాత్‌.. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారి స్మార్ట్‌ ఫోన్‌లోని కీలక సమాచారం చోరీ చేస్తున్నారని వివరించారు. కాంటాక్ట్స్‌ జాబితాతో పాటు ఫోన్‌లోని ఫొటోలు, వ్యక్తిగత సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు కొట్టేస్తున్నారు. అచ్చంగా వాట్సాప్ ఫీచర్లను పోలినట్లున్న ఈ మోడిఫైడ్‌ వాట్సాప్‌ వెర్షన్లతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అయితే ఈ నకిలీ వాట్సాప్‌ ప్లేస్టోర్‌లో లేదని, ఇతర సోర్స్‌ల ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుంటే నష్టపోతారని వాట్సాప్‌ యూజర్లను అలర్ట్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ రకమైన నకిలీ యాప్స్‌లో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ లాంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉండవు. ఇది కేవలం వాట్సాప్‌ ఒరిజినల్‌ వెర్షన్‌లోనే లభిస్తుందని సంస్థ తెలిపింది. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సెక్యూరిటీ ఉండడం ద్వారా వాట్సాప్‌ సంభాషణ చాటింగ్‌ చేస్తున్న ఇద్దరు వ్యక్తులకు తప్ప మరో వ్యక్తికి కనిపించదు. దీంతో యూజర్లకు భద్రత లభిస్తుంది. అయితే వాట్సాప్‌ పేరుతో చక్కర్లు కొడుతోన్న నకిలీ యాప్స్‌లో ఇలాంటి భద్రత లభించదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..