ప్రస్తుతం ఇప్పుడు అందరూ వాట్సాప్ వినియోగించడం సర్వసాధారణమైపోయింది. కాగా ఇప్పటికే వాట్సాప్ సంస్థ కూడా కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది వాట్సాప్. అది కూడా అందరికీ నచ్చేలా.. యానిమేటెడ్ స్టిక్కర్లను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ గ్రాఫిక్స్‌తో భావాలు మరింత లోతుగా వ్యక్త పరచవచ్చు. యూజర్లకు ఈ ఫీచర్ ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నట్లు వాట్సాప్ సంస్థ పేర్కొంది.
ఈ స్టిక్కర్‌లను ఎలా వాడాలంటే?
వాట్సాప్ స్టిక్కర్‌లను వినియోగించేందుకు చాట్ ఓపెన్ చేసి.. అందులో ఎమోజీ బటన్‌ను ప్రెస్ చేయాలి. ఇప్పటివరకూ అక్కడ ఎమోజీ, జిఫ్ ట్యాబ్‌లు మాత్రమే కనిపించేవి. ఇకపై వాటి పక్కన స్టిక్కర్ ట్యాబ్ కనిపిస్తుంది. దాని పక్కనే ‘+’ సింబల్ కనిపిస్తుంది. దానిని నొక్కితే రకరకాల స్టిక్కర్ ప్యాక్‌లు వస్తాయి. అందులో మీకు నచ్చిన వాటిని డౌన్‌లోడ్ చేసుకుని చాటింగ్‌లో ఉపయోగించుకోవచ్చు. మీకు వద్దనుకుంటే వాటిని డిటీల్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
Read More:
Gold rate@51K. రాబోతున్న శ్రావణ మాసం ఎఫెక్ట్‌తో ఇంకా పెరుగుతుందా!
గీతా ఆర్ట్స్ పేరుతో అమ్మాయిలకు వల.. బన్నీ పక్కన హీరోయిన్ అంటూ..