
సోషల్ మీడియాను గ్యాప్ లేకుండా వాడే వాళ్లలో ఫోమో అనే ఒక రకమైన మనస్తత్వం ఏర్పడుతుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఈ ఫోమో మాయలో పడ్డవాళ్ల మనస్తత్వం భిన్నంగా ఉంటుంది.
తాము ఏదో మిస్ అవుతున్నాం అనే ఆతృత అనుక్షణం ఊహా ప్రపంచంలో విహరించేలా చేస్తుంది. ఆన్‌లైనే లోకంగా గడిపేస్తుంటారు. నిమిషంలో ముప్ఫైసార్లు ఫోన్‌ని చెక్ చేసుకోవడం. భిన్నంగా ఉండాలనే తపనతో వెరైటీ కాన్సెప్ట్‌తో ఫొటోలు తీసి పోస్ట్ చేయడం. అత్యవసర పనులను కూడా లెక్కచేయకపోవడం. ఎప్పుడూ దిగాలుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైన మానసిక సమస్య అంటున్నారు సైకాలజిస్టులు. దీన్నుంచి బయటపడకపోతే జీవితం అంతా బాధ పడాల్సివస్తుందట.
సోషల్ మీడియా చూడడం మానేస్తే ఏదో మిస్ అవుతాం అన్న భయం. ఫ్రెండ్ ఫొటోకి లైక్‌లు వచ్చాయి, నాకు ఎందుకు రాట్లేదు? అన్న బెంగ, అందరూ హ్యాపీగా ఉంటున్నారు నేను తప్ప అనే బాధ.. ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నవాళ్లంతా ఫోమో సమస్యతో బాధ పడుతున్నట్టు అర్థం. ఈ ఫోబియా ఉన్నవాళ్లు పరిసరాలను పట్టించుకోరు. ఇంటికి సన్నిహితులొచ్చినా సమయాన్ని కేటాయించరు. చదువులో మార్కులు తగ్గుతున్నా పుస్తకం పట్టుకోరు. సందర్భం ఏదైనా చేతులు ఎప్పుడూ మొబైల్‌ను తడుముతూనే ఉంటాయి. ఇది మరింత ఎక్కువైతే యాంగ్జైటీ, డిప్రెషన్‌కు దారితీస్తాయి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.