Cleaning Tips: మీ ఇంటి పైకప్పు మీద ఉన్న ట్యాంక్ మురికిగా ఉందా? ఈ సింపుల్‌ చిట్కాలతో చిటికలో క్లీనింగ్‌

Water Tank Cleaning Tips: మీరు క్రమం తప్పకుండా (కనీసం ఆరు నెలలకు ఒకసారి) మీ ఇంటిపై కప్పుపై నీటి ట్యాంక్‌ను శుభ్రం చేస్తే నీరు స్వచ్ఛంగా ఉండటమే కాకుండా మీ కుటుంబం వ్యాధులకు దూరంగా ఉంటుంది. మీరు పడే కొంచెం కష్టం మీ కుటుంబాన్ని పెద్ద ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది..

Cleaning Tips: మీ ఇంటి పైకప్పు మీద ఉన్న ట్యాంక్ మురికిగా ఉందా? ఈ సింపుల్‌ చిట్కాలతో చిటికలో క్లీనింగ్‌
Water Tank Cleaning Tips

Updated on: Mar 28, 2026 | 1:26 PM

Water Tank Cleaning Tips: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం బయటకు కనిపించే వస్తువుల శుభ్రతపై చూపే శ్రద్ధ, కంటికి కనిపించని వాటిపై చూపడం లేదు. అందులో ముఖ్యమైనది మన ఇంటి నీటి ట్యాంక్. బయటకు అంతా బాగున్నట్లు కనిపించినా, ట్యాంక్ లోపల పేరుకుపోయిన మురికి మన ఆరోగ్యంపై నెమ్మదిగా ప్రభావం చూపుతుంది. పాచి, మట్టి, తుప్పు, సూక్ష్మక్రిములు నీటిలో కలిసి ఆ నీటిని కలుషితం చేస్తాయి. మనం తాగడానికి, స్నానానికి, వంటకు వాడే ఈ నీరు కలుషితమైతే రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.

చాలామంది నీటిలో వాసన రావడం లేదా రంగు మారడం జరిగే వరకు ట్యాంక్ శుభ్రతను వాయిదా వేస్తుంటారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే ట్యాంక్ లోపల దాగి ఉన్న ఈ మురికిని సీరియస్‌గా తీసుకుని, క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: పెట్రోల్ కష్టాలకు చెక్.. కేవలం రూ.49,999కే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. మార్చి 31 వరకు అదిరిపోయే ఆఫర్లు!

ఇవి కూడా చదవండి

1. ట్యాంక్‌ను పూర్తిగా ఖాళీ చేయండి

శుభ్రం చేయడం ప్రారంభించే ముందు ట్యాంక్‌లోని నీటిని పూర్తిగా ఖాళీ చేయడం మొదటి మెట్టు. నీరంతా తీసేస్తేనే లోపల ఉన్న మురికి స్పష్టంగా కనిపిస్తుంది. అడుగున కొంచెం నీరు మిగిలిపోతే దానిని బకెట్ లేదా మగ్‌తో తీసేయండి. ట్యాంక్ లోపలికి దిగేటప్పుడు జారుడుగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

2. పేరుకుపోయిన మురికి, పాచిని తొలగించండి

ఇప్పుడు ట్యాంక్ లోపల గోడలకు, అడుగున పేరుకుపోయిన మట్టి, పాచి, చెత్తను తొలగించాలి. దీని కోసం గట్టి బ్రష్ లేదా పొడవైన హ్యాండిల్ ఉన్న బ్రష్‌ను ఉపయోగించండి. ప్రతి మూలను బాగా రుద్ది శుభ్రం చేయండి. మురికి ఎక్కువగా ఉన్న చోట ప్రత్యేక శ్రద్ధ వహించండి. అవసరమైతే బ్రష్‌ను ఒక కర్రకు కట్టి కూడా లోపలి భాగాన్ని శుభ్రం చేయవచ్చు.

3. పటిక, బ్లీచింగ్‌తో తుది శుభ్రత

  • ట్యాంక్‌ను పూర్తిగా క్రిమిరహితం చేయడానికి పటిక (Fitkari), బ్లీచింగ్ పౌడర్‌ను ఉపయోగించండి.
  • పటిక: ఒక బకెట్ నీటిలో పటిక కలిపి ఆ ద్రావణాన్ని ట్యాంక్ గోడలకు వేసి రుద్దండి.
  • బ్లీచింగ్: ఆ తర్వాత బ్లీచింగ్ పౌడర్‌ను ట్యాంకు గోడలకు పట్టించి 10-15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి.
  • చివరగా ట్యాంక్‌ను మంచి నీటితో బాగా కడిగేయండి. బ్లీచింగ్ వాసన పోయే వరకు నీటితో రిన్స్ చేయడం మర్చిపోవద్దు.

శుభ్రమైన ట్యాంక్ – సురక్షితమైన నీరు:

మీరు క్రమం తప్పకుండా (కనీసం ఆరు నెలలకు ఒకసారి) నీటి ట్యాంక్‌ను శుభ్రం చేస్తే నీరు స్వచ్ఛంగా ఉండటమే కాకుండా మీ కుటుంబం వ్యాధులకు దూరంగా ఉంటుంది. మీరు పడే కొంచెం కష్టం మీ కుటుంబాన్ని పెద్ద ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది.

Gold Price Today: దిమ్మదిరిగే షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. తులంపై భారీగా పెరుగుదల!

LPG Booking: దేశంలో గ్యాస్‌ బుకింగ్‌ నిబంధనలు మారాయని మీకు తెలుసా? ఇలా చేస్తే సిలిండర్‌ అందదు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us