వోడాఫోన్ ఐడియా తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం అనేక మంచి ప్లాన్‌లను అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లు వినియోగదారులకు ఉచిత డేటాను అందించడమే కాకుండా అదనపు ఖర్చు లేకుండా డిస్నీ హాట్ స్టార్ ( Disney+ Hotstar ) ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. ఈ రోజు వోడాఫోన్ ఐడియా అందిస్తోన్న అద్భుతమైన Vi ప్లాన్ ఈ ప్లాన్ ధర ఎంత, ఈ ప్లాన్‌తో మీరు పొందే ప్రయోజనాలు ఏమిటి తదితర వివరాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
Vi 3099 ప్లాన్ వివరాలు: ఈ వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌తో, కంపెనీ వినియోగదారులకు ప్రతిరోజూ 2 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. డేటాతో పాటు, ఏ నెట్‌వర్క్‌కైనా లిమిట్ లేకుండా కాల్ చేసుకోవచ్చు. అంతేకాదు రోజుకు 100 SMSలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజుల ఇవ్వబడింది, దీని ప్రకారం.. ఈ ప్లాన్ లో మొత్తం 730 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది.
మీరు ఈ ప్లాన్‌లో భాగంగా మీ నంబర్‌ను రీఛార్జ్ చేయించుకుంటే.. ఈ ప్లాన్‌తో మీకు 75 GB బోనస్ డేటా ఇవ్వబడుతుందని సదరు కంపెనీ పేర్కొంది. ఇది మాత్రమే కాదు.. ఈ ప్లాన్‌తో మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ను అదనపు ప్రయోజనంగా కస్టమర్ పొందుతాడు. అది కూడా 1 సంవత్సరం పాటు డిస్నీ సేవలను అందిస్తోంది. అయితే ఇక్కడ వోడాఫోన్ ఐడియా కస్టమర్ గమనించాల్సిన విషయం ఏమిటంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్ ఈ ప్లాన్‌తో అందించబడుతుంది.
డేటా, కాలింగ్‌తో పాటు, ఈ ప్లాన్‌తో రోజుకు 100 SMSలు కూడా అందించబడతాయి. ఇతర ప్రయోజనాలు ఏమిటంటే.. ఈ ప్లాన్‌తో మీరు ఉదయం 12 నుండి ఉదయం 6 గంటల వరకు సర్ఫింగ్, స్ట్రీమింగ్ , షేరింగ్ చేయవచ్చు. ఈ ప్లాన్ మరొక ప్రత్యేకత ఏమిటంటే.. దీనికి ఎటువంటి డేటా ఖర్చు కాదు. ఇది కాకుండా.. వారాంతపు డేటా, Vi సినిమాలు , టీవీకి ఉచిత యాక్సెస్ అందుబాటులో ఉంటుంది.
Vi 1499 ప్లాన్ వివరాలు: ఈ Vodafone Idea రీఛార్జ్ ప్లాన్‌తో, 1.5 GB హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ , 100 SMSలు ప్రతిరోజూ అందించబడతాయి. దీనితో పాటు, ఎవరైనా ఈ ప్లాన్‌లో భాగంగా రీఛార్జ్ చేసుకుంటే, 50 GB ఉచిత డేటా కూడా ఇవ్వబడుతుంది. ఈ ప్లాన్‌తో, వినియోగదారులకు 180 రోజుల చెల్లుబాటు ఇవ్వబడింది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..