AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బహుబలి బ్యాటరీతో వస్తున్న వివో ఫోన్‌! ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే చాలు..

వివో Y-సిరీస్ కొత్త ఫోన్ Y600 ప్రో 10,000mAh భారీ బ్యాటరీతో రానుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు వాడొచ్చు. స్లిమ్ డిజైన్, యువతను ఆకట్టుకునే ఊదా రంగులో ఉంటుంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ చేసే వారికి పర్ఫెక్ట్. ధర సుమారు రూ.20,000-రూ.25,000 మధ్య ఉండవచ్చు.

బహుబలి బ్యాటరీతో వస్తున్న వివో ఫోన్‌! ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే చాలు..
Vivo Y600 Pro
SN Pasha
|

Updated on: Apr 18, 2026 | 6:03 AM

Share

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో ఇప్పుడు భారీ బ్యాటరీల ట్రెండ్‌లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే రియల్‌మీ, హానర్‌, వన్‌ప్లస్‌, ఒప్పో వంటి బ్రాండ్‌లు పెద్ద బ్యాటరీలతో ఫోన్లు తీసుకురావడంతో ఇప్పుడు వివో కూడా 10,000mAh బ్యాటరీతో కొత్త Y-సిరీస్ ఫోన్‌ను టీజ్ చేసింది. ఈ ఫోన్‌ను వివో Y600 ప్రోగా విడుదల చేసే అవకాశం ఉందని అంచనా. వీబోలో విడుదలైన టీజర్‌ను బట్టి చూస్తే, ఫోన్ డిజైన్ సింపుల్‌గా, ఫ్లాట్ బ్యాక్‌తో పాటు పెద్ద గుండ్రని కెమెరా మాడ్యూల్‌తో ఉండొచ్చని తెలుస్తోంది.

ఊదా రంగు ఫినిష్‌తో యూత్‌ను ఆకట్టుకునేలా ఉండనుంది. పవర్, వాల్యూమ్ బటన్లు సైడ్‌లో ఉండగా, పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ స్లిమ్ డిజైన్‌ను కొనసాగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ మాత్రం 10,000mAh భారీ బ్యాటరీ. ఒకసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు వాడుకునేలా ఉంటుందని కంపెనీ సంకేతాలు ఇస్తోంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటి హెవీ యూజ్‌కూ సరిపడేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజూ ఛార్జర్ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఉండటం దీనిలో పెద్ద ప్లస్‌గా భావిస్తున్నారు.

ధర విషయానికొస్తే గత మోడల్ Y500 ప్రో ధరను బట్టి చూస్తే, Y600 ప్రో ధర సుమారు రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య ఉండే అవకాశం ఉంది. మొదట చైనాలో విడుదల చేసి, ఆ తర్వాత భారత్ సహా ఇతర మార్కెట్లలో లాంచ్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి కెమెరా కంటే బ్యాటరీ లైఫ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వినియోగదారులకు ఈ ఫోన్ మంచి ఆప్షన్‌గా మారే అవకాశముంది. 2026లో భారీ బ్యాటరీ ఫోన్ల మార్కెట్‌లో ఇది ఒక కొత్త ప్రమాణాన్ని సెట్ చేసే అవకాశముంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే