Vivo Y21A: 5000mAh బ్యాటరీతో విడుదలైన వివో స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

|

Jan 25, 2022 | 2:06 PM

ఈ వివో ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, డైమండ్ గ్లో అనే 2 కలర్ ఆప్షన్‌లలో విడుదలైంది. Vivo Y21A స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి నోట్ 10, పోకో ఎం3, ఇన్ఫినిక్స్ నోట్ 11ఎస్ వంటి స్మార్ట్‌ఫోన్‌లకు గట్టిపోటీని ఇస్తుందని సంస్థ పేర్కొంది.

Vivo Y21A: 5000mAh బ్యాటరీతో విడుదలైన వివో స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Vivo Y21a
Follow us on

Vivo Y21A: వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వివో వై21ఏ (Vivo Y21A) ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ వివో ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, డైమండ్ గ్లో అనే 2 కలర్ ఆప్షన్‌లలో విడుదలైంది. Vivo Y21A స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి నోట్ 10, పోకో ఎం3, ఇన్ఫినిక్స్ నోట్ 11ఎస్ వంటి స్మార్ట్‌ఫోన్‌లకు గట్టిపోటీని ఇస్తుందని సంస్థ పేర్కొంది.

Vivo Y21A స్మార్ట్‌ఫోన్ ధర..
Vivo Y21A స్మార్ట్‌ఫోన్ ధర రూ.13,990గా సంస్థ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM, 64GB స్టోరేజ్‌లో అందుబాటులో ఉంది. వివో ఇండియా ఈ-స్టోర్, అన్ని పార్టనర్ రిటైల్ స్టోర్‌లలో సేల్‌కు అందుబాటులో ఉంది. ఇంతకుముందు, Vivo Y21e స్మార్ట్‌ఫోన్ రూ. 12,990 ధరతో ప్రారంభించారు. ఈ ఫోన్ 3GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

Vivo Y21A స్పెసిఫికేషన్‌లు..
Vivo Y21A 6.51 అంగుళాల HD + హాలో డిస్‌ప్లేను కలిగి ఉంది. అత్యుత్తమ వీక్షణ అనుభవం కోసం స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-సెల్ టెక్నాలజీ అందించారు. స్మార్ట్‌ఫోన్‌లో ఐ ప్రొటెక్షన్ మోడ్ కూడా ఉంది. ఇది వినియోగదారుల వీక్షణ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ మందం 8.0 మిమీ. స్మార్ట్‌ఫోన్ బరువు 182 గ్రాములు. Octa-core MediaTek Helio P22 ప్రాసెసర్‌తో విడుదలైంది.

Vivo Y21A స్మార్ట్‌ఫోన్ 5,000 mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జ్‌కు మద్దతు ఇస్తుంది. రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉంది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ అవసరమైనప్పుడు పవర్ బ్యాంక్ లా కూడా పనిచేస్తుంది.

స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ఉన్న ప్రధాన కెమెరా 13 మెగాపిక్సెల్‌ అందించారు. ఇది కాకుండా, ఫోన్ వెనుక భాగంలో 2-మెగాపిక్సెల్ సూపర్ మాక్రో కెమెరా ఉంది. ఫోన్ ముందు భాగంలో, సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ కెమెరా అందించారు. సెల్ఫీ కెమెరాలో AI బ్యూటిఫికేషన్ మోడ్ కూడా ఉంది.

కనెక్టివిటీ కోసం, ఇందులో 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ V5.0, GPS / A-GPS, FM రేడియో, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సెన్సార్ల గురించి మాట్లాడితే, ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read: Super Computer: హై స్పీడ్ కంప్యూటర్.. ఏఐ టెక్నాలజీతో మెటా అద్భుత సృష్టి.. వెల్లడించిన జుకర్‌బర్గ్!

Redmi Note 11S: రెడ్‌మీ నుంచి మ‌రో కొత్త ఫోన్ వ‌చ్చేస్తోంది.. నోట్ 11 ఎస్ వ‌చ్చేదెప్పుడంటే..