భారత్‌లో ఇటీవల స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుంది. విస్తృత మార్కెట్ దృష్ట్యా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా ప్రతిసారి కొత్త మోడల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇదే కోవలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో కూడా తన కొత్త మోడల్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. తన సక్సెస్ ఫుల్ వై సిరీస్‌లోనే కొత్త మోడల్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వివో వై 100 పేరుతో లాంచ్ చేస్తున్న ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.24,999కు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఫోన్ వెనుక అధునాతన ఏజీ గ్లాస్‌తో వస్తుంది. ఆటోమెటిక్‌గా రంగు మార్చుకోవడం ఈ ఏజీ గ్లాస్ ప్రత్యేకత. ట్విలైట్ గోల్డ్ వెర్షన్ సూర్యాస్తమయం ద్వారా ప్రభావితమై నారింజ-గోల్డ్ రంగులోకి మారుతుంది. సూర్యకాంతి లేదా యూవీ కిరణాల ఫోన్‌పై పడినప్పుడు ఫోన్ రంగులు మారతాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ ఫోన్‌లో వచ్చే ఇతర అధునాతన ఫీచర్లు ఏంటో ఓ సారి చూద్దాం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..