ఎంతో మంది ఎదురుచూస్తున్న వివో X200T లాంచ్‌కు డేట్‌ ఫిక్స్‌! ఇండియాలో ధర ఎంతంటే..?

వివో X200T ఇండియాలో ఎప్పుడు లాంచ్‌ చేస్తున్నారో కంపెనీ వెల్లడించింది. ఈ క్రేజీ ఫోన్‌ MediaTek Dimensity 9400+ ప్రాసెసర్, 6,200mAh బ్యాటరీ, 50MP ZEISS ట్రిపుల్ కెమెరాలతో ఈ ఫోన్ రూ.50,000-55,000 మధ్య లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, వివో స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

ఎంతో మంది ఎదురుచూస్తున్న వివో X200T లాంచ్‌కు డేట్‌ ఫిక్స్‌! ఇండియాలో ధర ఎంతంటే..?
Vivo X200t

Updated on: Jan 21, 2026 | 12:55 AM

ఇండియాలో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి రెడీగా ఉంది. టెక్‌ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వివో X200T ఈ నెల 27న మార్కెట్‌లోకి రానుంది. X200 సిరీస్‌లో ఇప్పటికే X200 FE, X200, X200 ప్రో అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్‌ను మొదట 2024లో ప్రవేశపెట్టారు. లాంచ్‌కు ముందు వివో అధికారికంగా ఫోన్ లాంచ్ తేదీ, కీలక ఫీచర్లను ప్రకటించింది.

ఎక్స్‌లో చేసిన ఒక పోస్ట్‌లో Vivo X200T జనవరి 27న ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, Vivo ఇండియా ఆన్‌లైన్ స్టోర్, దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ మన దేశంలో రూ.50,000 నుండి రూ.55,000 మధ్య ధర ఉంటుందని అంచనా. స్టెల్లార్ బ్లాక్, సీసైడ్ లిలాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఇది కంపెనీ X200 లైనప్‌లో Vivo X200 FEతో పాటు ఉంటుందని భావిస్తున్నారు.

ఫీచర్లు..

X200T 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల డిస్‌ప్లే, 5,000 నిట్‌ల వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని Vivo ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను MediaTek Dimensity 9400+ ప్రాసెసర్‌తో పవర్ చేస్తారు. ఇది Origin OSలో రన్ అవుతుంది. 6,200mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 50MP ZEISS సూపర్ టెలిఫోటో కెమెరా, 50MP ZEISS ప్రధాన కెమెరా, 50MP ZEISS అల్ట్రా వైడ్-యాంగిల్ కెమెరా, Vivo X200T IP68, IP69 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌తో వస్తుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి