Smart Phone: మతిపోయే ఫీచర్స్‌తో మరో మడత ఫోన్..లాంచింగ్ ఎప్పుడంటే?

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. ప్రతి రోజూ ఏదో ఓ కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో మార్కెట్‌లో ఫోల్డబుల్ ఫోన్లను ప్రముఖ కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ వివో మరో కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను త్వరలో అధికారికంగా లాంచ్ చేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో వివో రిలీజ్ చేయబోయే ఫోల్డబుల్ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Smart Phone: మతిపోయే ఫీచర్స్‌తో మరో మడత ఫోన్..లాంచింగ్ ఎప్పుడంటే?
Vivo X Fold 5

Updated on: Jun 14, 2025 | 4:20 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో ఎక్స్ ఫోల్డ్ 5 పేరుతో త్వరలో ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఎక్స్ ఫోల్డ్ 3 వెర్షన్ కంటే తేలికగా ఉండే ఈ ఫోన్ పనితీరు విషయంలో మెరుగ్గా ఉండేలా కంపెనీ డిజైన్ చేసింది. ఈ నెల చివర్లో చైనాలో జరిగే కార్యక్రమంలో ఈ ఫోన్ లాంచ్ చేయనున్నారు. చైనాలో నాలుగో నంబర్‌ను అశుభకరమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ సిరీస్‌లోని ఫోల్డ్ 3 తర్వాత నేరుగా ఎక్స్ ఫోల్డ్-5ను లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ త్వరలో భారతదేశంలో లాంచ్ చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వివో ఎక్స్ ఫోల్డ్ 5 లాంచ్ ఈవెంట్ జూన్ 25, 2025న చైనాలో నిర్వహించనున్నరాు. భారతదేశంలోని అధికారిక ఛానెల్‌ల ద్వారా సాయంత్రం 4:30 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. 

వివో ఎక్స్ ఫోల్డ్ 5 టీజర్ ఫోల్డబుల్ నలుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. మునుపటి వెర్షన్ లాగా వృత్తాకార మాడ్యూల్‌లో నిర్మించిన జీస్ ఆప్టిక్స్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఎక్స్ ఫోల్డ్ 5 కేవలం 8.7 ఎంఎం మందంతో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లోని 8.5 ఎంఎం ఫ్రేమ్ లాగా దాదాపుగా సొగసైనదిగా చేస్తుంది. ఫోల్డ్ 5 బరువు దాదాపు 209 గ్రాములు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ప్రధాన డిస్‌ప్లేను 2కే ఎమోఎల్ఈడీ ప్యానెల్‌తో డిజైన్ చేశారని, రెండు స్క్రీన్‌లు 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది.  వివో తన ఫోల్డబుల్‌లో భారీ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ అప్‌గ్రేడ్‌లన్నీ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో జత చేయవచ్చు. 

కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ సెన్సార్ల ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చు. ఇందులో వైడ్, అల్ట్రా-వైడ్, పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.  జూలైలో భారతదేశంలో ఎక్స్ ఫోల్డ్ 5 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించనుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి